ETV Bharat / bharat

మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాల్సిందే - కీలక మార్గదర్శకాలు జారీచేసిన దిల్లీ ఎయిమ్స్‌ - Mpox Scare

Mpox Scare : ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, దిల్లీ ఎయిమ్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపాక్స్​ వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Monkeypox scare
Mpox scare (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 7:05 AM IST

Mpox Scare : ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీ ఎయిమ్స్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపాక్స్‌ అనుమానిత లేదా నిర్ధరణ కేసుల కోసం దిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంపాక్స్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 15,600 కేసులు, 537 మరణాలు నమోదయ్యాయి. మన దేశంలో మార్చి తర్వాత కొత్తగా ఎంపాక్స్‌ కేసులు నమోదు కాలేదు. కనుక మన దగ్గర వ్యాప్తి తీవ్రత తక్కువేనని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

  • అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్‌ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్క్రీనింగ్​ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • జ్వరం, దద్దుర్లు వచ్చిన వారికి, ఎంపాక్స్‌ నిర్ధరిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి
  • జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధరణ చేయాలి.
  • అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్‌లో ఉంచాలి. తద్వారా ఇతరులకు సోకకుండా నివారించవచ్చు.
  • ఎంపాక్స్‌ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధరణ, చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించాలి.
  • రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలి.
  • ఎంపాక్స్‌ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించాలి.

ఆందోళన దేనికి?
మంకీపాక్స్‌లో క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో క్లాడ్‌-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా, క్లాడ్‌-2 తక్కువ ప్రమాదకరంగా ఉంది. క్లాడ్‌-1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టిరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10 శాతం వరకు ఉంది. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుంది.

ఎలా వ్యాప్తి చెందుతుంది?
నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల, రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల వైరస్‌ ప్రవేశించవచ్చు.

లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 - 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు, తల నొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 - 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది వ్యాధి సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.

టీకాలు ఉన్నాయా?
ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు 2 రకాల టీకాలు ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్ - ఏంటీ కొత్త భయం? - Prathidhwani Debate On Monkeypox

చంద్ర‌యాన్ 4, 5 డిజైన్లు కంప్లీట్​- ఐదేళ్లలో 70 ఉపగ్రహాల ప్రయోగం: ఇస్రో చీఫ్ - Chandrayaan 4 And 5

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.