Monkey Enters Ram Mandir : అయోధ్య రామమందిరంలో ఆసక్తికర ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించడం వల్ల అక్కడున్న భక్తులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వానరం రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పరుగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. ఆ గేటు మూసి ఉండడం వల్ల తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకుని ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్లిపోయింది.
-
आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…
">आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…
కాగా, వానరం ఆలయంలో ప్రవేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రామ్లల్లాను చూసేందుకు హనుమంతుడే గర్భగుడిలోకి ప్రవేశించాడని భద్రతా సిబ్బంది వ్యాఖ్యానించారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. వానరం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది.
మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలోకి వానరం ప్రవేశించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం వివిధ కామెంట్లు పెడుతున్నారు. రామయ్య చూసేందుకు హనుమంతుడు వచ్చాడని పోస్ట్లు చేస్తున్నారు.
కాగా, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు నుంచే అయోధ్య రామాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంగళవారం (జనవరి 23) ఒక్కరోజే బాల రాముడిని సుమారు 5లక్షల మంది దర్శించుకున్నారు. బుధవారం సైతం భక్తులు భారీ సంఖ్యలో క్యూలో ఉన్నారు.
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ
జనవరి 22న అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించారు. మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు. సోమవారం(జనవరి 22) మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాముడికి ప్రధాని మోదీ పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. అనంతరం శ్రీరాముడికి ప్రధాని హారతి ఇచ్చారు. విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడం వల్ల ప్రధాని మోదీ సహా అతిథులు, ప్రజలు తన్మయత్వం చెందారు.
అయోధ్య రాముడికి కొత్త పేరు- ఇకపై ఏమని పిలుస్తారంటే?
అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు