Modi on Swachh Bharat Mission : గత పదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోవర్ధన్ యోజనకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
'స్వచ్ఛ భారత్ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు. ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం. దేశ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీల, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నేను అభినందిస్తున్నా. మీరంతా కలిసి దీనిని ప్రజా ఉద్యమంగా మార్చారు. మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి సహకరించారు. ఇక స్వచ్ఛతకు సంబంధించిన రూ.10వేల కోట్లు విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిషన్ అమృత్ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నమామి గంగా పనులైతేనేమి, వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గోవర్దన్ ప్లాంట్ల వంటి పనులు స్వచ్ఛభారత్ మిషన్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ఎంత విజయవంతమైతే అదే స్థాయిలో దేశకీర్తి పెరుగుతుంది. 1000 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు 21వ శతాబ్దపు భారతదేశం గురించి మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను గుర్తుకు తెచ్చుకుంటారు' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Vigyan Bhawan, Delhi: Addressing the event to mark the 10 years of the Swachh Bharat Mission, PM Narendra Modi says, " ... in the last 10 years, crores of indians have made this mission their personal goal. after this journey of a decade, i appreciate the contribution of… pic.twitter.com/Q9YxOtSlbc
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Vigyan Bhawan, Delhi: Addressing the event to mark the 10 years of Swachh Bharat Mission, PM Narendra Modi says, " 1000 years from now, when studies will be carried out about india of the 21st century, swachh bharat abhiyaan will be remembered. in this century, swachh… pic.twitter.com/6CMAdF64sM
— ANI (@ANI) October 2, 2024
'అప్పుడు నన్ను ఎగతాళి చేశారు'
గత ప్రభుత్వాలు ఎప్పుడూ మురుగు నీటిని, మరుగుదొడ్లు లేకపోవడాన్ని జాతీయ సమస్యలుగా పరిగణించలేదని ప్రధాని మోదీ విరమర్శించారు. 'ఫలితంగా ప్రజలు అపరిశుభ్రమైమ పరిస్థితుల్లోనే జీవించాల్సి వచ్చింది. నేను ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చినప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. 10 సంవత్సరాల క్రితం 60శాతం కంటే ఎక్కువ జనాభా బహిరంగ మలవిసర్జన చేయాల్సి వచ్చేది. ఇది మన గౌరవానికి విరుద్ధం, అవమానించడమే అవుతుంది. ముఖ్యంగా మహిళలకు అసౌకర్యాన్ని కలిగించేది' అని మోదీ అన్నారు.
#WATCH | Vigyan Bhawan, Delhi: Addressing the event to mark the 10 years of the Swachh Bharat Mission, PM Narendra Modi says, " ... they (previous governments) never considered dirtiness and lack of toilets as national issues. 'aisa lag raha hai jaise unhone gandagi ko hi zindagi… pic.twitter.com/cEAgvhH40f
— ANI (@ANI) October 2, 2024
'పిల్లల ప్రాణాలను కాపాడుతుంది'
ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ 60 వేల నుంచి 70 వేల మంది పిల్లల ప్రాణాలను కాపాడుతుందని అంతర్జాతీయ నివేదికలు తెలిపాయని ప్రధాని మోదీ అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వల్ల 90శాతం మంది మహిళలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. స్వచ్ఛ భారత మిషన్ పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం తీసుకొచ్చిందని, వారి పట్ల ప్రజల వైఖరిలో కూడా మార్పు వచ్చిందని అన్నారు.