ETV Bharat / bharat

మోదీతో దీదీ భేటీ- సందేశ్​ఖాలీ దారుణాలపై ప్రధాని ఫైర్​! - Sandeshkhali News

Modi On Sandeshkhali : ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా కలిశారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. ఇది కేవలం ప్రోటోకాల్​ సమావేశమేనని, ఇందులో రాజకీయ చర్చలేమీ జరగలేదని ఆమె తెలిపారు. అంతకుముందు బంగాల్​ హుగ్లీ జిల్లాలో పర్యటించిన ప్రధాని, తృణమూల్‌ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సందేశ్​ఖాలీలో మహిళలపై జరిగిన వేధింపుల గురించి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్​ రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేదని అన్నారు.

PM Modi On Sandeshkhali Issue
PM Modi On Sandeshkhali Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 6:11 PM IST

Updated : Mar 1, 2024, 7:44 PM IST

Modi On Sandeshkhali : బంగాల్​ రాజధాని కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా కలిశారు (West Bengal CM Meeting Today). 'ఇది కేవలం ప్రోటోకాల్​ భేటీనే, ఎటువంటి రాజకీయ పరమైన చర్చలు ఈ సమావేశంలో జరగలేదు' అని సమావేశం అనంతరం ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

'దీని గురించి తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేది'
మరోవైపు బంగాల్​ సందేశ్​ఖాలీలో మహిళలపై జరిగిన వేధింపుల గురించి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్​ రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హుగ్లీ జిల్లా ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సందేశ్‌ఖాలీలో సోదరీమణులకు టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందంటూ ప్రధాని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు స్పందించలేదన్న ఆయన సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ షేక్‌ తన పరిధులను దాటాడని దుయ్యబట్టారు. కానీ బీజేపీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళల గౌరవం కోసం పోరాడారని వెల్లడించారు.

'బంగాల్​ అభివృద్ధికి దీదీ అడ్డంకి'
'టీఎంసీ ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారతకు అతిపెద్ద అడ్డంకిగా ఉంది. ఈ నాలుగు వర్గాలు సాధికారత సాధించనంత వరకు బంగాల్‌ అభివృద్ధి చెందదు. బీజేపీ ప్రభుత్వమే లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు కోటా కల్పించింది. బీజేపీ ప్రభుత్వమే నమో డ్రోన్‌ దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక డ్రోన్లను ఎగురవేయటంపై శిక్షణ ఇస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం గ్రామగ్రామాన మహిళా సంఘాలకు లక్షలకోట్ల సాయం అందిస్తోంది. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే సంకల్పం తీసుకున్నాం' అని మోదీ తెలిపారు.

రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
21వ శతాబ్దంలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మనమందరం కలిసి సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు. పదేళ్లలో కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. ఝార్ఖండ్‌ పర్యటన ముగించుకొని బంగాల్‌ వెళ్లిన ప్రధాని మోదీ హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌లో రూ.7,200 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైలు, పోర్టులు, ఆయిల్‌ పైప్‌లైన్‌, ఎల్​పీజీ సరఫరా, మురికినీటి శుద్ధి ప్లాంటు వంటి అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటమే కాకుండా వాటిని జాతికి అంకితం ఇచ్చారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా బంగాల్‌లోనూ రైల్వేల ఆధునీకరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.

'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక

మోదీ మరోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర- 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ముస్లిం యువతి ప్లాన్

Last Updated : Mar 1, 2024, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.