Rahul Gandhi On NEET Issue : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. నీట్ అంశంలో ఏమి జరుగుతుందో తెలియక దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ధనికులుగా ఉంటే పరీక్షపేపర్లు కొనవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉందని వ్యాఖ్యానించారు. తమ కూటమికి ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు.
పరీక్షలను నిర్వహించే విషయంలో వ్యవస్థాపరంగా లోపం ఉందన్న రాహుల్ గాంధీ, దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతి ఒక్కరినీ నిందించారని ఆరోపించారు. తన లోపాన్ని మాత్రం కప్పిపుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
#WATCH | Congress MP and LoP in Lok Sabha Rahul Gandhi says " as this (neet) is a systematic issue, what exactly are you doing to fix this issue?
— ANI (@ANI) July 22, 2024
education minister dharmendra pradhan says "...a lie will not become truth just by shouting. the fact that the leader of opposition… pic.twitter.com/gbTXVoqytk
"మన పరీక్షా విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయన్న విషయం దేశం మెుత్తానికి అర్థమైంది. భారతీయ పరీక్షా విధానం ఒక మోసమని నమ్ముతున్నారు. డబ్బు ఉంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయవచ్చని లక్షలాది మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. కేవలం నీట్‌లోనే కాదు ప్రతి ప్రధాన పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రతి ఒక్కరినీ నిందించారు. కాని తన లోపాన్ని మాత్రం కప్పిపుచ్చుకున్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కావడం లేదని నేను అనుకుంటున్నాను"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
లీకుల్లో కేంద్రం రికార్డ్ : అఖిలేశ్
పేపర్ లీకుల విషయంలో మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. నీట్ పరీక్ష జరిగిన కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఆయన మంత్రిగా (ధర్మేంద్ర ప్రధాన్) ఉన్నంత కాలం విద్యార్థులకు న్యాయం జరగదని ఆరోపించారు.
'పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవు'
మరోవైపు, నీట్ అంశంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని, 240 పరీక్షలను ఎన్టీఏ సమర్థవంతంగా నిర్వహించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత ఏడేళ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 4,700 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తే బిహార్‌లోని పట్నా పరీక్షా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాల్లో కొన్ని తప్పులు దొర్లాయని చెప్పారు. వాటిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుంటే విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.
#WATCH | Opposition MPs raise NEET exam issue in Lok Sabha
— ANI (@ANI) July 22, 2024
Union Education Minister Dharmendra Pradhan says, " ...no evidence of paper leak has been found in the last 7 years. this (neet) matter is going on before the supreme court. i can say with full responsibility that more… pic.twitter.com/uoWySlfQYP
నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్‌మైండ్స్ అరెస్ట్- నిందితులిద్దరు MBBS విద్యార్థులే - NEET UG Paper Leak
పరీక్ష కేంద్రాల వారీగా NEET ఫలితాలు ప్రకటించండి: సుప్రీం కోర్టు - NEET UG Paper Leak Case