ETV Bharat / bharat

రైల్వే ఉద్యోగుల అవినీతిపై 10వేలకుపైగా ఫిర్యాదులు- తర్వాతి ప్లేస్​లో బ్యాంక్ ఎంప్లాయీస్​! - CVC GRAFT COMPLAINTS IN 2023 - CVC GRAFT COMPLAINTS IN 2023

Corruption Complaints Against Railway Employees : దేశంలో రైల్వే ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో రైల్వే ఉద్యోగులపైనే ఎక్కువగా ఉన్నాయి. అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగుల అవినీతిపైనా వేలాది ఫిర్యాదులు అందుతున్నట్లు CVC వెల్లడించింది. మరోవైపు వివిధ కారణాలతో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల విచారణ ఏళ్లకొద్దీ సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Corruption Complaints Against Railway Employees
Corruption Complaints Against Railway Employees (ETV Bharat, CVC)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 4:16 PM IST

Corruption Complaints Against Railway Employees : దేశంలో అవినీతి కేసులపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్-CVC ఆశ్చర్యకరమైన గణాంకాలను వెల్లడించింది. గత ఏడాది తమకు అందిన అవినీతి కేసుల్లో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులపై ఉన్నాయని తెలిపింది. తర్వాత దిల్లీలోని స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులపై ఫిర్యాదులు అందాయంటూ CVC వార్షిక నివేదిక విడుదల చేసింది. గత ఏడాది అవినీతికి సంబంధించి 74,203 ఫిర్యాదులు అందగా వాటిలో 66,373 ఫిర్యాదులను పరిష్కరించామని, 7,830 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. తమకు రైల్వే ఉద్యోగులపైనే ఏకంగా 10,447 ఫిర్యాదులు వచ్చాయని CVC వివరించింది.

అవినీతిపై 2023లో సీవీసీకి వచ్చిన ఫిర్యాదులు
మొత్తం ఫిర్యాదులు74, 203
పరిష్కారమైనవి 66, 373
పెండింగ్‌7, 830
రైల్వే ఉద్యోగులు 10, 447
దిల్లీ స్థానిక సంస్థలు 7, 665
ప్రభుత్వ ఉద్యోగులు 6, 638
దిల్లీ పోలీసులు 3, 325
బొగ్గు శాఖ 4, 420
కార్మిక శాఖ 3, 217

పెట్రోలియం శాఖ 2, 749
హోంశాఖ 2, 309
రక్షణ శాఖ 1, 861
సీబీడీటీ 1, 828
టెలీకమ్యూనికేషన్లు1, 457

దిల్లీ స్థానిక సంస్థలపై 7,665 ఫిర్యాదులు
దేశ రాజధాని ప్రాంతం-NCR మినహా దిల్లీలోని స్థానిక సంస్థలపై 7,665 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. వాటిలో దిల్లీ పారిశ్రామిక, మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్, దిల్లీ జల్ బోర్డు, పర్యాటక, రవాణా అభివృద్ధి కార్పొరేషన్, రవాణా కార్పొరేషన్, దిల్లీ ట్రాన్స్‌కో, పవర్ జనరేషన్‌, మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందినట్లు CVC వివరించింది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై 6,638 ఫిర్యాదులు వచ్చాయని, దిల్లీ పోలీసులపై 3,325 ఫిర్యాదులు అందాయని తెలిపింది.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెద్దఎత్తున ఫిర్యాదులు!
ఇక, ప్రభుత్వరంగ బ్యాంకులపై 7,004 ఫిర్యాదులు రాగా 6,667 పరిష్కరించామని, 337 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. కేంద్ర బొగ్గు శాఖ ఉద్యోగులపై 4,420, కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగులపై 3,217 ఫిర్యాదులు వచ్చాయని CVC వెల్లడించింది. పెట్రోలియం శాఖ ఉద్యోగులపై 2,749, హోంశాఖ ఉద్యోగులపై 2,309, రక్షణ శాఖ ఉద్యోగులపై 1,861 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉద్యోగులపై 18,28, టెలీకమ్యూనికేషన్ల విభాగం ఉద్యోగులపై 14,57 ఫిర్యాదులు వచ్చాయని, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు ఉద్యోగులపై 1205 ఫిర్యాదులు అందాయన వివరించింది. మరికొన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులపైనా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.

ప్రభుత్వరంగ బ్యాంకులపై ఫిర్యాదులు
మొత్తం ఫిర్యాదులు 7, 004
పరిష్కారమైనవి 6, 667
పెండింగ్​లో ఉన్నవి 337

మరోవైపు, CBI దర్యాప్తు చేస్తున్న 6,900 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు CVC తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందులో 361 కేసులు 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది.2వేల 461 కేసుల్లో విచారణ పదేళ్లు దాటిపోయిందన్న CVC ఇది ఆందోళనకరమని పేర్కొంది. వివిధ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసుల పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లింక్​ చేయండి.

ADR Report On MPS Criminal Cases : 40 శాతం సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. YCP ఎంపీల్లో 13 మందిపై..

కేంద్రమంత్రుల్లో 99శాతం మంది కోటీశ్వరులే- అందుకోలేనంత ఎత్తులో పెమ్మసాని - ADR Report On Central Ministers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.