Man Contesting Election For 14th Time : తొలి గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఓ వ్యక్తి. ఇప్పటివరకు 13సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన పోపట్లాల్, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 14వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా, ఉన్న ఆస్తులు అమ్మి మరీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే పోపట్లాల్ ఇలా అలుపెరుగక చేస్తున్న ప్రయత్నం ఎందుకోసం? అసలు రాజకీయాల్లోకి ఆయనకు ఎందుకు రావాలనిపించిందో? ఇప్పుడు తెలుసుకుందాం.
![Man Contesting Election For 14th Time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-04-2024/21270964_p1-3.jpg)
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా సమ్దారి ప్రాంతానికి చెందిన వ్యక్తి పోపట్లాల్ (57). తన ప్రాంతాన్ని చేసి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోపట్లాల్ గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతేకాకుండా తన భార్యను ఐదుసార్లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో, ఓసారి జిల్లా పరిషత్ ఎలక్షన్లో నిలబెట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో తనకు మూడో స్థానం వచ్చిందని పోపట్లాల్ తెలిపారు. అయితే ఇన్నిసార్లు పోటీ చేసినా పోపట్లాల్కు నిరాశే ఎదురైంది. అయినా వెనకడుగు వేయకుండా 14వ సారి బాడ్మెర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి, రవీంద్ర సింగ్ భాటి, ఉమేరామ్ బేనివాల్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు.
![Man Contesting Election For 14th Time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-04-2024/21270964_p1-1.jpg)
ఆస్తులు అమ్మి మరీ!
పోపట్లాల్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన భార్య, కుమారుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ సమస్యలు పోపట్లాల్ను ఆపలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు పశువులను, భూమిని కూడా అమ్ముకున్నారు. అయితే ప్రారంభంలో కుటుంబ సభ్యులు వారించారని కానీ ఆ తర్వాత మద్దతు ఇచ్చారని పోపట్లాల్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పోపట్లాల్ ఏ రాజకీయ పార్టీ నుంచి టికెట్ అడగలేదు. ఈ విషయంపై ప్రశ్నించగా, టికెట్ రైతులు, ప్రజల వద్ద ఉందని అన్నారు. అయితే ఆర్థికంగా స్తోమత లేని పోపట్లాల్, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంట్లో భోజనం చేసి ప్రచారానికి వెళతున్నారు. ప్రచార సామాగ్రిని గుడ్డ సంచిలో వేసుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. పోపట్లాల్ ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాధారన లభిస్తోంది. దీంతో కనీసం ఒక్కసారైనా ప్రజలను తనకు మద్దతు ఇస్తారని పోపట్లాల్ బలంగా నమ్ముతున్నారు.
![Man Contesting Election For 14th Time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-04-2024/21270964_p1-2.jpg)
'కాంగ్రెస్ యువరాజుకు వయనాడ్‌లోనూ కష్టమే- కొత్త స్థానం చూసుకోవాలి' - Lok Sabha Election 2024