ETV Bharat / bharat

'సీఎం పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం'- మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ - Doctors Meeting With CM Mamata - DOCTORS MEETING WITH CM MAMATA

Doctors Meeting With CM Mamata : ప్రజల కోసం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. వైద్యులతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

Doctors Meeting With CM Mamata
Doctors Meeting With CM Mamata (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 7:40 PM IST

Updated : Sep 13, 2024, 6:31 AM IST

Doctors Meeting With CM Mamata : ప్రజల కోసం సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్​జీ కర్​ ఆస్పత్రి జూనియర్​ వైద్యురాలి హత్యాచారం విషయంలో న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆర్​జీ కర్​ ఆస్పత్రి ఘటనపై ప్రతిష్టంభన తొలగించడానికి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి మూడుసార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. వైద్యుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటి వరకూ 27 మంది మరణించారు, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్​జీ కర్ ప్రతిష్టంభనకు నేడు ముగింపు లభిస్తుందని ఆశించిన బంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

''ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల జూనియర్‌ వైద్యులు డిమాండ్‌ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. అయితే, ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను'' అని మమతా బెనర్జీ చెప్పారు.

సీఎంతో జూనియర్​ వైద్యుల చర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. సీఎంతో భేటీని లైవ్ టెలికాస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే, 30మంది వైద్యుల బృందాన్ని చర్చలకు అనుమతించాలన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 15మందికే అనుమతి ఉంది అని చెప్పింది. దానికి ఒప్పుకోని వైద్యుల బృందం, తాము 30మంది వెళ్తామని ప్రకటించింది. దీంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.

మరోవైపు, వైద్యులతో భేటీ అయ్యేందుకు తాను దాదాపు రెండు గంటలపాటు వేచి చూసినట్లు మమత తెలిపారు. ఈ నేఫథ్యంలో డీజీపీ రాజీవ్ కుమార్, ఎడీజీ (దక్షిణ బెంగాల్) సుప్రతిమ్ సర్కార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ వైద్యుల బృందంతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా బంగాల్ సీఎస్ స్పందించారు. "లైవ్ స్ట్రీమింగ్ కుదరదని మేము వైద్యులకు లేఖలో తెలిపాం. అయితే, సమావేశం మొత్తాన్ని డాక్యుమెంటేషన్ చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటల పాటు చర్చల కోసం ఎదురు చూశారు. మేము వైద్యులను ఒప్పించేందుకు ప్రయత్నించాం. కాని వారు ఈ సమావేశానికి హాజరుకావాలని అనుకోవడం లేదు.'' అని సీఎస్ పంత్ అన్నారు.

'మా డిమాండ్లు న్యాయమైనవే'
అయితే, ఈ చర్చల ప్రతిష్టంభనకు కారణం ప్రభుత్వమే అని జూనియర్​ డాక్టర్లు తప్పుబట్టారు. చర్చలను లైవ్​ టెలీకాస్ట్​ చేయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని ఆరోపించారు. దానికి తమను నిందించడం దురదృష్టకరమని చెప్పారు. "సీఎం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. మేము చర్చలు జరగాలనే కోరుకున్నాం. కానీ, చర్చల ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. మా డిమాండ్లు న్యాయమైనవే. సమావేశం పారదర్శకత కోసమే మేము లైవ్ టెలీకాస్ట్​ చేయాలని కోరాము." ఓ జూనియర్​ వైద్యుడు తెలిపాడు.

'రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై చర్యలు'
ఆర్​జీ కర్​ ఆస్పత్రి ఘటనపై ప్రజలందరూ గుర్రుగా ఉన్న దృష్ట్యా, తాను బంగాల్​ సీఎం మమతా బెనర్జీతో ఎలాంటి బహిరంగ వేదికను పంచుకోనని గవర్నర్ సీవీ ఆనంద్​ బోస్​ అన్నారు. తాను కూడా సామాజికంగా ముఖ్యమంత్రిని బహిష్కరిస్తానని వీడియో సందేశంలో తెలిపారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై క్రియాశీలక చర్యలు తీసుకుంటాను. రాజ్యాంగ బాధ్యతలకే పరిమితం నా పాత్ర పరిమితం అవుతుంది. నేను బంగాల్ ప్రజలకు కట్టుబడి ఉన్నాను. అభయ తల్లిదండ్రులకు, ఆమెకు న్యాయం జరగాలను నిరసనల చేస్తున్న వారి కోసం కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటిస్తున్నాను. తన బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని నేను భావిస్తున్నాను.

సుప్రీం ఆదేశించినా విధుల్లోకి చేరని వైద్యులు- చర్చలకు ఆహ్వానించిన సీఎం! - Kolkata Rape Murder Case

Last Updated : Sep 13, 2024, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.