Building Collapse Lucknow : ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 28 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం లఖ్‌నవూలో జరిగింది. పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని వెలికితేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో గిడ్డంగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 5 గటంల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలకితీశారు.
VIDEO | Uttar Pradesh: Rescue operations underway at the incident site at Transport Nagar area of Lucknow where a building collapsed earlier today.
— Press Trust of India (@PTI_News) September 7, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Nxzsv3YTz4
ఇక శనివారమే ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ శశాంక్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొదట్లో వర్షం కారణంగా బిల్డింగ్ కుప్పకూలినట్లు భావించారు. కానీ బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
''లఖ్‌నవూలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని హర్మిలాప్ భవనాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ మూడంతస్తుల ఈ భవనంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మోటార్ వర్క్‌షాప్, మొదటి అంతస్తులో మెడికల్ గొడౌన్, రెండవ అంతస్తులో కత్తిపీట గొడౌన్ ఉన్నాయి. శనివారం వర్షం కురిసింది. అదే సమయంలో బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడింది. దీనితో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో అందులో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని అధికారులు వివరాలు వెల్లడించారు.
స్పందించిన సీఎం
ప్రమాద ఘటనపై రక్షణశాఖ మంత్రి, లఖ్‌నవూ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి, గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
#UPCM @myogiadityanath ने ट्रांसपोर्ट नगर, लखनऊ में बिल्डिंग गिरने से हुए हादसे का संज्ञान लिया।
— CM Office, GoUP (@CMOfficeUP) September 7, 2024
मुख्यमंत्री जी ने जिला प्रशासन के अधिकारियों, SDRF और NDRF की टीमों को मौके पर पहुंचकर राहत कार्य में तेजी लाने और घायलों को तत्काल अस्पताल पहुंचाकर उनके समुचित उपचार के निर्देश दिए…