ETV Bharat / bharat

మోదీ మెజార్టీ ఎంత? రాహుల్ రెండు చోట్ల గెలుస్తారా? ఈ స్థానాల రిజల్ట్స్​పై అందరి ఫోకస్​! - lok sabha election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 5:01 PM IST

Updated : Jun 4, 2024, 6:29 AM IST

Loksabha Election Key Contestants : మంగళవారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ, రాజీవ్‌ చంద్రశేఖర్‌, క్రికెటర్ యూసఫ్‌ పఠాన్‌ సహా మాజీ సీఎంలు, సినీ నటులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

LOK SABHA ELECTION 2024
LOK SABHA ELECTION 2024 (ANI)

Loksabha Election Key Contestants : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కొన్నిచోట్ల వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా, మరికొన్నిచోట్ల తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్‌ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీజేపీ శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా ప్రధానికి అనుకూలంగా రావడం వల్ల మరింత జోష్‌ మీద ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున అజయ్‌ రాయ్‌ నిలిచారు.

రాహుల్​ రెండు చోట్ల గెలుస్తారా?
గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. 2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన్న రాహుల్‌, ఈసారి మరో కంచుకోటైన రాయ్‌బరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ఇక్కడ రాహుల్‌ గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ తరఫున దినేశ్‌ ప్రతాప్‌ సింగ్ నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్‌ పోటీ చేశారు. ఇక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కే సురేంద్రన్‌ రాహుల్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు.

గాంధీలు లేకుండా అమేఠీ పోరు
గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి గత ఎన్నికల్లో దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేఠీలో గెలుపు తథ్యమంటున్నారు. పాతికేళ్లలో తొలిసారి నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా అమేఠీ ఎన్నికలు జరగడం వల్ల అందరి ఆసక్తి దీనిపై పడింది. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ నిలవగా, కాంగ్రెస్‌ తరఫున ఐరాస మాజీ దౌత్యవేత్త శశిథరూర్‌ పోటీచేశారు. బంగాల్‌లోని బహరంపుర్‌ ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. అధికార టీఎంసీ తరఫున మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ పోటీ చేయగా, కాంగ్రెస్‌ తరఫున ఆ రాష్ట్ర అగ్రనేత అధీర్‌ రంజన్‌ చౌదరీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అన్నామలై గెలుస్తారా?
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బరిలో నిలిచిన కోయంబత్తూరు ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అసలు తమకు పట్టులేని తమిళనాడులో బీజేపీకి కొంత ఆదరణ లభించిందంటే అది అన్నామలై కష్టమేనని చెప్పాలి. ఇక విరుధ్‌నగర్‌లో బీజేపీ తరఫున నిలిచిన సినీ నటి రాధికకు పోటీగా దివగంత నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ డీఎండీకే తరఫున గట్టి పోటీనిచ్చారు. బీజేపీ తరఫున తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పోటీ చేసిన చెన్నై దక్షిణ నియోజకవర్గం, DMK తరఫున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ బరిలో ఉన్న చెన్నై సెంట్రల్‌ స్థానం, DMK తరఫున మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి పోటీ చేసిన తూత్తుకుడి స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

హాసన్​పై ప్రత్యేక దృష్టి
కర్ణాటకలో సంచలనం సృష్టించిన హాసన్ సెక్స్‌ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ పోటీ చేసిన హాసన్‌ నియోజకవర్గ ఫలితాలపై ప్రత్యేక దృష్టి పడింది. మండ్య నుంచి జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మైసూర్‌ నుంచి బరిలో నిలిచిన మైసూర్‌ రాజవంశానికి చెందిన యదువీర్‌ వడియార్‌ ఆ ఎన్నికల్లో ఎంతమేర విజయం సాధిస్తారో చూడాలి. మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై హవేరీ నుంచి బరిలో నిలిచారు. మరో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్‌ బెల్గాం తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

సినీ ప్రముఖులు నిలుస్తారా?
పలువురు సినీ ప్రముఖులు సైతం ఈసారి బరిలో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి బీజేపీ తరఫున సినీ నటి హేమమాలిని, మేరఠ్‌ నుంచి రాముడి పాత్రధారి అరుణ్‌గోవిల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌, బంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి TMC తరఫున శత్రుఘ్న సిన్హా పోటీ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ నుంచి బీజేపీ తరఫున మేనకా గాంధీ పోటీ చేయగా, కన్నౌజ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, మెయిన్‌పురి నుంచి ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌, లఖ్‌నవూ నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేశారు. అటు మధ్యప్రదేశ్‌లో ఛింద్వాడా నుంచి కాంగ్రెస్‌ తరఫున ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ తన అదృష్టం పరీక్షించుకున్నారు. గుణ నుంచి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదిశ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ రాష్ర్ట మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రాజ్‌గడ్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ చేశారు.

వదినమరదళ్లలో గెలుపెవరిది?
మహారాష్ట్రలో నాగ్‌పుర్‌ నుంచి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ బరిలో నిలవగా, బారామతి స్థానంలో పవార్‌ కుటుంబానికి చెందిన వదినామరదళ్లు ఎన్సీపీ శరద్‌ వర్గం నుంచి సుప్రియా సూలే, ఎన్సీపీ అజిత్‌ వర్గం నుంచి సునేత్రా పవార్‌ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో బారాముల్లా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, అనంతనాగ్‌-రాజౌరీ‍‌ నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, బంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ నుంచి టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, బిహార్‌ జమూయ్‌ స్థానంలో ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌, రాజస్థాన్‌ కోటా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌, హరియాణా కర్నాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పోటీ చేశారు.

'ఇవన్నీ మోదీ మీడియా పోల్స్​- ఇండియాకు 295 సీట్లు పక్కా'- ఎగ్జిట్​ పోల్స్​పై కాంగ్రెస్​ - lok sabha election 2024

దీదీ, నవీన్​కు షాక్​- కేరళలో బీజేపీ బోణీ- కర్ణాటకలో కాషాయ రెపరెపలు! - Exit Poll 2024 Lok Sabha

Last Updated : Jun 4, 2024, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.