ETV Bharat / bharat

అమితాబ్​పైకి చున్నీలు విసిరి అమ్మాయిల సందడి- 4వేల బ్యాలెట్ పేపర్లపై లిప్​స్టిక్​ గుర్తులు! - 1984 LS Polls Amitabh Bachchan - 1984 LS POLLS AMITABH BACHCHAN

Lok Sabha Elections Amitabh Bachchan : దేశంలో లోకసభ ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్​ సమయం దగ్గర పడుతుండటం వల్ల ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ జరిగే కొన్ని విచిత్ర సంఘటనలను మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఘటనే 1984లో జరిగింది. ఆ ఏడాది బిగ్ బి అమితాబ్​ బచ్చన్​ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. అవేంటంటే?

1984 Lok Sabha Elections Amitabh Bachchan

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 10:03 AM IST

Lok Sabha Elections Amitabh Bachchan : ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​, ఇప్పటికు ఒక్కసారే ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1984లో ప్రయాగ్​రాజ్​ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనపై భారతీయ లోక్​దళ్​ సీనియర్​ నేత హేమవతి నందన్​ బహుగుణ పోటీ చేశారు. ఆ సమయంలో బిగ్​ బి ప్రచారం నుంచి మొదలుకుని ఓటింగ్​ వరకు ఎన్నో విచిత్ర ఘటనలు జరిగాయి.

1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ బాధ్యత అంతా రాజీవ్​గాంధీ భుజస్కంధాలపైనే ఉంది. తన బలమైన ప్రత్యర్థి హేమవతి నందన్​ బహుగుణపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాల్సి వచ్చింది. రాజీవ్​ హత్యతో ప్రజల సానుభూతి కాంగ్రెస్‌పై ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్​ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రాజీవ్​ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అప్పటికే అమితాబ్​ బచ్చన్​ ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలను అందిస్తూ బాలీవుడ్​ ఇండస్ట్రీలో సూపర్​ స్టార్​గా రాణిస్తున్నారు. రాజీవ్​ గాంధీకి అమితాబ్​ స్నేహితుడు కావడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయాలని రాజీవ్ పట్టుబట్టారు. దీంతో అమితాబ్​ ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారు.

'లవ్​ యూ అమితాబ్​​జీ' అంటూ చున్నీల విసుర్లు!
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అమితాబ్​ బచ్చన్​ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో ఆయనకు అమ్మాయిలు, మహిళలు డప్పులు కొడుతూ స్వాగతం పలికేవారు. బిగ్ బీ ఎక్కడికి వెళ్లినా 'లవ్​ యూ అమితాబ్ ​జీ' అంటూ అమ్మాయిలు గుంపులు గుంపులుగా అమితాబ్​ను ఫాలో అయ్యేవారు. అమితాబ్​పై​ తమ చున్నీలను విసురుతూ రచ్చరచ్చ చేసేవారు.

సిగ్గుపడ్డ అమితాబ్​!
అమితాబ్ ప్రత్యర్థి హేమవని నందన్​ బహుగుణ బలమైన రాజకీయ నాయకురాలు. ఆమెను ఓడించడం అంత సులువు కాదు. అయినప్పటికీ ప్రయాగ్‌రాజ్​ వీధుల్లో అమితాబ్​ బచ్చన్​ ఎక్కడికి వెళ్లినా, ప్రజలు ఆయన వెంట పరుగులు తీసేవారు. క్రమంగా బిగ్​ బి సభలకు యువతతో పాటు మహిళలు భారీగా తరలివచ్చేవారు. ఈ సమయంలో అమితాబ్​ బచ్చన్​ తన సతీమణి జయా బచ్చన్‌తో కలిసి ప్రచారం కూడా చేశారు. అయితే చాలాసార్లు ప్రచారం సమయంలో అభిమానుల వింత చేష్టలు చూసి అమితాబ్​ సిగ్గుపడాల్సి వచ్చింది.

బ్యాలెట్‌లపై లిప్‌స్టిక్​ గుర్తులు!
ఇక పోలింగ్ రోజు ప్రయాగ్‌రాజ్​ ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బ్యాలెట్‌పై అమితాబ్‌కు వచ్చిన ఓట్లతో పాటు లిప్‌స్టిక్​ గుర్తులు కూడా కనిపించాయి. కౌంటింగ్​ కొనసాగుతున్న కొద్దీ లిప్​స్టిక్​ గుర్తులతో కూడిన బ్యాలెట్ల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభమైంది. అమితాబ్‌కు ఓటుతో పాటు లిప్‌స్టిక్‌ గుర్తులు కూడా ఉన్నటు వంటి దాదాపు 4000 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. చివరకు ఈ నాలుగు వేల ఓట్లను ఎన్నికల సంఘం రద్దు చేసింది.

కాగా, ఈ ఎన్నికల్లో అమితాబ్‌కు 2,97,461 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి భారతీయ లోక్​దళ్​ అభ్యర్థి హేమవతి నందన్​ బహుగుణకు కేవలం 1,09,666 ఓట్లు వచ్చాయి. అమితాబ్​ బచ్చన్​ 1,87,795 ఓట్లతో గెలుపొందారు. అయితే ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కాకుండానే అమితాబ్​ బచ్చన్​ రాజకీయాలకు దూరమయ్యారు.

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

బాలీవుడ్​ నటి కంగనాకు అనేక ఎన్నికల 'సవాళ్లు'- ఆ ఒక్క అంశంతో విజయం సాధిస్తారా? - Kangana Ranaut Loksabha Elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.