ETV Bharat / bharat

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారతరత్న- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ - bharat ratna to LK Advani

LK Advani Bharat Ratna : బీజేపీ అగ్రనేత ఎల్​కే అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. మరోవైపు, భారతరత్నను అత్యంత వినయంతో అంగీకరిస్తున్నట్లు అడ్వాణీ తెలిపారు.

LK Advani Bharat Ratna
LK Advani Bharat Ratna
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 11:45 AM IST

Updated : Feb 3, 2024, 3:29 PM IST

LK Advani Bharat Ratna : బీజేపీ కురువృద్ధుడు, కమలం పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్​) వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. అడ్వాణీకి భారతరత్న వరించడం తనకు ఉద్వేగభరితమైన క్షణమని తెలిపారు. దేశ హోం మంత్రిగా, సమాచార, ప్రసార మంత్రిగా సేవలందించారని తెలిపారు.

"శ్రీ ఎల్‌కే అడ్వాణీ జీకి భారతరత్న అందించబోయే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అడ్వాణీ ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో నుంచి మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగింది. దేశ హోం మంత్రిగా, సమాచార, ప్రసార మంత్రిగా సేవలందించారు."
-- ప్రధాని మోదీ ట్వీట్​

'పార్లమెంటరీ ప్రసంగాలు ఆదర్శప్రాయమైనవి'
"ఆయన పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి. ప్రజా జీవితంలో అడ్వాణీ సుదీర్ఘంగా పారదర్శకత, సమగ్రతతో సేవలందించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించడానికి ఆయన అసమానమైన కృషి చేశారు. ఆయనకు భారతరత్న అందించడం చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఆయనతో సంభాషించడానికి, నేర్చుకోవడానికి నాకు లెక్కలేన్ని అవకాశాలు లభించడం అదృష్టంగా భావిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు.

అడ్వాణీ స్పందన ఇలా!
భారతరత్న అవార్డు తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం ఉత్తమంగా సేవ చేసేందుకు కృషి చేసిన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన అవార్డు అని ఎల్​కే అడ్వాణీ పేర్కొన్నారు. అత్యంత వినయంతోపాటు కృతజ్ఞతతో తాను ఈ పురస్కారాన్ని అంగీకరిస్తున్నానట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. "నేను 14 సంవత్సరాల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో వాలంటీర్‌గా చేరినప్పటి నుంచి నాకు అప్పగించిన ఏ పనినైనా అంకితభావంతో నిస్వార్థంగా చేశాను. ఈ జీవితం నాది కాదు. నా జీవితమంతా దేశం కోసమే. ఈ సమయంలో ఇప్పటికే భారతరత్న అవార్డులు పొందిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ , భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీని స్మరించుకుంటున్నాను. ప్రజా జీవితంలో నాతో కలిసి పనిచేసిన లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యావాదాలు" అని తెలిపారు అడ్వాణీ.

అభిమానులకు అభివాదం
కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత అడ్వాణీ తొలిసారి బయటకొచ్చారు. దిల్లీలోని ఆయన నివాసం వద్ద అభిమానులకు అభివాదం చేశారు. అడ్వాణీ వెంట ఆయన కూతురు ప్రతిభ ఉన్నారు. అడ్వాణీకి ప్రతిభ మిఠాయి తినిపించారు. తమ నాన్నకు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించినందుకు మొత్తం కుటుంబం సంతోషంగా ఉందని ప్రతిభా అడ్వాణీ పేర్కొన్నారు. అడ్వాణీ జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారని తెలిపారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.

రాజకీయాల్లో స్వచ్ఛతకు అడ్వాణీ ప్రతీక!
"మనందరికీ స్ఫూర్తిదాయకమైన, సీనియర్‌ నేత లాల్‌కృష్ణ అడ్వాణీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని నిర్ణయించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. రాజకీయాల్లో స్వచ్ఛతకు, అంకితభావానికి, సంకల్పానికి ఆయన ప్రతీక. అడ్వాణీ జీ తన సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశ అభివృద్ధికి అందించిన గణనీయమైన సహకారం మరువలేనిది. భారతదేశ ఐక్యత, సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. భారతరత్న పురస్కారం అందుకోవడం ప్రతి భారతీయుడికి సంతోషకరమైన విషయం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు" అని దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్​ సింగ్ ట్వీట్​ చేశారు.

అపూర్వమైన కృషి!
అడ్వాణీకి భారతరత్నను ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. అడ్వాణీ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేశారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ ఉప ప్రధానమంత్రి వంటి వివిధ రాజ్యాంగ బాధ్యతలను నిర్వహిస్తూనే, తన బలమైన నాయకత్వంతో దేశ భద్రత, ఐక్యత, సమగ్రత కోసం అపూర్వమైన కృషి చేశారని గుర్తు చేశారు. అడ్వాణీని భారతరత్నతో సత్కరించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కోట్లాది దేశప్రజలకు దక్కిన గౌరవమని అమిత్‌ షా పేర్కొన్నారు

"దేశంలోనే సీనియర్ నాయకుడు, మా మార్గనిర్దేశకుడు ఎల్​కే అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" - నితిన్‌ గడ్కరీ

"భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. ఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటినుంచి ఆయన అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి నాపై చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనివి" - వెంకయ్య నాయుడు

"బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉంది. దశాబ్దాల సేవ, నిబద్ధత, నైతికతకు గుర్తింపు లభించింది. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరిలో ప్రేరణ నింపింది" - యోగి ఆదిత్యనాథ్‌

Last Updated : Feb 3, 2024, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.