Tips For Washing White Clothes : కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దుస్తులపై వివిధ రకాల మరకలు పడుతుంటాయి. అయితే వీటిలో కొన్ని రకాల మరకలు సులభంగా వదిలిపోతే.. మరికొన్నింటిని తొలగించడం మాత్రం కష్టంగా మారుతుంది. మరి, ముఖ్యంగా తెల్లని బట్టల విషయంలో అయితే ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఎందుకంటే.. వాటిపై ఏ చిన్నమరక పడినా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంతో కొందరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వైట్ షర్ట్స్‌ని పక్కన పెట్టేస్తుంటారు. మీరు తెల్లని బట్టల విషయంలో ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేస్తున్నారా? అయితే, ఇకపై ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. కొన్ని వాషింగ్ టిప్స్‌తో తెల్లని దుస్తులపై ఎలాంటి మొండి మరకలైనా(Stains) ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రంగు మరకలు : తెలుపు రంగు దుస్తులను రంగు పోయే దుస్తులతో ఎప్పుడూ నానబెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. అవి తొందరగా వైట్ డ్రెస్సెస్‌కు అంటుకుంటాయి. ఎంత ఉతికినా ఈ రంగు మరకలు ఓ పట్టాన వదలవు. ఒకవేళ తెల్లని బట్టలకు రంగు మరకలు అంటితే ఇలా సింపుల్‌గా తొలగించుకోండని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక చిన్న తెల్ల గుడ్డ ముక్క తీసుకొని.. దానిపై హెయిర్ స్ప్రే, రబ్బింగ్ ఆల్కహాల్ లేదంటే 90 శాతం ఆల్కహాల్ ఉన్న ఏదైనా ద్రావణం పోసుకోవాలి. ఆపై దాంతో మరక పడ్డ చోట పదే పదే తుడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మరక వదిలిపోతుంది. ఆపై దాన్ని సాధారణంగా ఉతికి ఆరేస్తే సరిపోతుందంటున్నారు.
ఇలా నానబెట్టండి : మీ తెల్లని దుస్తులపై ఏదైనా మరకలు పడినప్పుడు.. ముందుగా బకెట్లో సమాన పరిమాణంలో వేడి నీరు, చల్లని వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో కొద్దిగా వంటసోడా, అరచెంచా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేదంటే నిమ్మరసం తీసుకోండి. అలాగే ఆ మిశ్రమంలో సబ్బు, షాంపూ కూడా వేసి కలపాలి. అనంతరం మరకలు పడిన దుస్తులను కొద్దిసేపు నానబెట్టాలి. అవి నానిన తర్వాత అవసరమనుకుంటే మరకలు ఉన్న చోట కొద్దిగా సబ్బు అప్లై చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మరకలు చాలా వరకూ తగ్గుతాయని చెబుతున్నారు.
వాట్ ఆన్ ఐడియా : షర్ట్ మీద చట్నీ- కుర్తామీద కాఫీ - మరక ఎంత మొండిదైనా మటాషే!
టూత్ పేస్ట్ : ఎంత వాష్ చేసినా కూడా.. ఇంకా ఏమైనా మొండి మొరకలు ఉంటే టూత్‌పేస్ట్‌ను(Toothpaste) ఇలా ట్రై చేయండి. వాడని టూత్‌బ్రష్ తీసుకొని దానిపై కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి మరకలు ఉన్న చోట స్మూత్‌గా స్క్రబ్ చేయండి. ఆపై శుభ్రమైన వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, తెల్లని బట్టలు ఉతికాక వేరే బట్టలతో కలిపి నీటిలో క్లీన్ చేయకుండా.. సపరేట్గా క్లీన్ చేసుకొని పిండి ఆరేసుకుంటే మంచిదంటున్నారు.
2011లో 'టెక్స్‌టైల్ రీసెర్చ్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. టూత్‌పేస్ట్‌లోని క్షయకరణ కారకాలు తెల్ల బట్టలపై ఏర్పడిన మొండి మరకలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్స్‌టైల్ సైన్స్ ఎండ్ ఇంజినీరింగ్ నిపుణుడు డాక్టర్ హైమ్ గాబ్రియెల్ పాల్గొన్నారు. తెల్ల దుస్తులపై మరకలను పోగొట్టడంలో టూత్‌పేస్ట్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
మీ దుస్తుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా? - ఇలా చేస్తే ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి!
దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్- వాషింగ్ మెషీన్లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!