ETV Bharat / bharat

ల్యాబ్​లో చేప మాంసం తయారీ- డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్లేనట! - kerala cmfri lab fish

Lab Grown Fish Meat : దేశంలోని తొలిసారిగా ల్యాబ్‌లో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనుంది కేరళలోని CMFRI. సీఫుడ్‌కు పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

Lab Grown Fish Meat
Lab Grown Fish Meat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 6:02 PM IST

Lab Grown Fish Meat : దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనుంది సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI). సీఫుడ్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించొచ్చని తెలిపింది.

తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువాయి చేప!
'చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ల్యాబ్‌ సెటప్‌లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తాం. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయి. తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువాయి చేప, సీర్‌ఫిష్‌ మాంసాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో చేపట్టనున్నాం. కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నీట్‌ మీట్‌ బయోటెక్‌తో చేతులు కలిపాం. ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం' అని CMFRI వివరించింది.

సెల్ కల్చర్ లేబొరేటరీ ఏర్పాటు!
అయితే ఈ ఒప్పందం ప్రకారం, అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై పరిశోధన చేస్తుంది CMFRI. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతుంది. జన్యు, జీవరసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుంది. ఈమేరకు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరోవైపు సెల్ కల్చర్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్‌ మీట్‌, సెల్ గ్రోత్ మీడియా ఆప్టిమైజేషన్, సెల్ అటాచ్‌మెంట్ బయోరియాక్టర్‌ల ద్వారా ఉత్పత్తి వంటి కార్యకలాపాలను చేపడుతుంది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం కావాల్సిన మానవ వనరులతో పాటు ఇతర అదనపు పరికరాలను సమకూర్చనుంది.

చికెన్​ సైతం ల్యాబ్​లో
అయితే మాములుగా చికెన్‌ తినాలంటే కోడిని కోయాల్సిందే. సమీప భవిష్యత్తులో కోడిని కోయకుండా కూడా చికెన్‌ తినేయ్యొచ్చు. కోడిని కోయకుండా చికెనా, అదేలా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. మొట్టమొదటిసారిగా ల్యాబ్​లో తయారు చేసిన చికెన్‌ను అమెరికాలోని రెస్టారెంట్లలో విక్రయించడం ప్రారంభించారు. త్వరలో ఈ చికెన్‌ సూపర్ మార్కెట్‌లలోనూ దర్శనం ఇవ్వనుంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.