Kolkata Doctor Death : కోల్‌కతాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య తర్వాత నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వైద్యురాలిపై ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి, ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినట్లు తేలింది.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వాసుపత్రిలో, జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన ఆర్జీ కార్ ప్రభుత్వాసుపత్రిలో వరుసగా మూడో రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు.
VIDEO | Members of Resident Doctors’ Association (RDA), AIIMS New Delhi, hold a candle march in remembrance of the trainee doctor who was raped and murdered on the premises of RG Kar Medical College in Kolkata.
— Press Trust of India (@PTI_News) August 11, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/W36sFExSXM
#WATCH | RG Kar Medical College and Hospital incident | Delhi: Resident Doctors' Association (RDA) AIIMS staged a candle march from JLN stadium to AIIMS, in support of the woman doctor who was sexually assaulted and murdered in RG Kar Medical College, Kolkata pic.twitter.com/Gs4hgmXdan
— ANI (@ANI) August 11, 2024
హాలులో నిద్రిస్తున్న డాక్టర్‌పై హత్యాచారం!
మరోవైపు హత్యాచార ఘటనలో తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వైద్యురాలపై లైంగిక దాడి జరిగిందని తేలిందని, ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు వెల్లడైందని అన్నారు. ఇతర శరీర భాగాలపైనా గాయాలు ఉన్నట్లు తేలిందని, అయితే, హత్య తర్వాతే లైంగిక దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతోందని కొందరు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు హత్యాచారానికి ఒడిగట్టాడని అంచనా వేస్తున్నారు.
కీచకుడికి నాలుగు పెళ్లిళ్లు!
ఈ నేపథ్యంలో, పోస్టుమార్టం తుది నివేదిక వచ్చిన తర్వాత నిర్ధారణకు వస్తామని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌పై పోలీసులు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చగా, ఆగస్టు 23వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. అటు నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ కీచకుడి అనుచిత ప్రవర్తనకు విసిగివేసారి ముగ్గురు వదిలి వెళ్లిపోగా, ఒక భార్య గతేడాది క్యాన్సర్‌తో మృతి చెందినట్లు వెల్లడించారు.
'వాడు పుట్టినప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి'
సంజయ్ రాయ్ స్థానికంగానూ పోకిరీ చేష్టలతో ఇబ్బంది కలిగించేవాడని తెలిసింది. ఇదే విషయంపై నిందితుడి తల్లి స్పందిస్తూ, సంజయ్‌కు జన్మనిచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. కానీ, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడతాడని మాత్రం అనుకోలేదని, ఇది నమ్మశక్యంగా లేదన్నారు.
అలర్ట్- దేశవ్యాప్తంగా సోమవారం వైద్య సేవలు నిలిపివేత! - Doctors Strike In India