ETV Bharat / bharat

హత్యాచారం కేసు ప్రధాన నిందితుడికి లై డిటెక్షన్‌ టెస్ట్‌- మాజీ ప్రిన్సిపల్ ఆస్తులపై సీబీఐ నజర్​! - Kolkata Doctor Case - KOLKATA DOCTOR CASE

Kolkata Doctor Case Update Today : జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్​ రాయ్​కు లై డిటెక్షన్‌ టెస్ట్‌ జరిగింది. ఇంకో ఇద్దరికి సీబీఐ కార్యాలయంలో నిర్వహించారు అధికారులు. మరోవైపు ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌ ఆస్తులపై సీబీఐ దాడులు మొదలుపెట్టింది.

Kolkata Doctor Case Update Today
Kolkata Doctor Case Update Today (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 5:12 PM IST

Kolkata Doctor Case Update Today : బంగాల్​ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో లై డిటెక్షన్‌ టెస్ట్‌ జరిగింది. మరో ఇద్దరికి కోల్‌కతాలోని సీబీఐ ఆఫీసులో ఆదివారం ఈ పరీక్షను నిర్వహించినట్లు విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో సహా నలుగురికి శనివారం సీబీఐ ఆఫీస్‌లో సత్యనిరూపణ పరీక్ష పూర్తయింది. వారిలో ఇంటర్న్‌లు, డాక్టర్లతో సహా ప్రధాన నిందితుడి స్నేహితుడు ఒకడు ఉన్నారు.

అయితే శనివారం లై డిటెక్షన్‌ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటం వల్ల ఆదివారం నిర్వహించారు. దిల్లీ నుంచి సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి చెందిన పాలీగ్రాఫ్‌ నిపుణుల బృందం కోల్‌కతాకు వచ్చి పరీక్షలను నిర్వహించారు. మొత్తం ఏడుగురిపై పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ టెస్ట్‌ను ఏడుగురిపై విడతల వారీగా నిర్వహిస్తామని పరీక్షలు పూర్తయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని సీబీఐ తెలిపింది. సీబీఐ విచారణలో నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చినప్పుడు మాత్రం తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయాడు. ఈ నేపథ్యంలో లైడిటెక్షన్‌ పరీక్షలో నిందితుడు ఏం చెప్పి ఉంటాడన్నదానిపై ఆసక్తి నెలకొంది.

డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ ఇంటిపై సీబీఐ దాడులు
మరోవైపు, డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ ఆస్తులపై ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేశాయి. ఆర్జీ కర్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఘోష్‌పై కేసులు నమోదు చేసింది.

నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలకు నోటీసులు
అయితే కోల్​కతా హత్యాచార ఘటనపై జరుగుతున్న నిరసనల్లో పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారనే ఆరోపణలు రావడం వల్ల బంగాల్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అనేక పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. "ఆగస్టు 23న పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వేళల్లో ర్యాలీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా విద్యార్థులు రోడ్లపైకి రావడం వారికి ఏ మాత్రం సురక్షితం కాదు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన. ఈ విషయంపై పాఠశాలల యాజమాన్యాలు 24గంటల్లోగా నివేదిక సమర్పించాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం" అని రాష్ట్ర ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. హావ్​డా, బంకురా, మేదినీపుర్​లో పలు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

నేను ఏ తప్పూ చేయలేదు- కుట్రపూరితంగా ఇరికించారు: కోల్​కతా హత్యాచార నిందితుడు! - Kolkata Doctor Murder Case

'ఆమె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు! సెమినార్​ హాల్​ బయట ఉన్నదెవరు?' : సీబీఐ - Kolkata Doctor Case CBI Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.