ETV Bharat / bharat

'అప్పుడు అక్కడ లేను- నేను వెళ్లే సరికే ఆమె చనిపోయింది'- కోల్​కతా కేసులో ట్విస్ట్! - Kolkata Doctor Case

Kolkata Doctor Case Polygraph Test Report : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడికి చేసిన పాలీగ్రాఫ్‌ పరీక్షలో పొంతలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్‌ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

Kolkata Doctor Case Polygraph Test Report
Kolkata Doctor Case Polygraph Test Report (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 1:31 PM IST

Kolkata Doctor Case Polygraph Test Report : కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలోని జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు చేసిన లై డిటెక్టర్‌ పరీక్షలో అసత్య, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆదివారం నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షల్లో నిందితుడు ఏం చెప్పాడన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే, పాలీగ్రాఫ్‌ పరీక్షలో నిందితుడు అసత్య, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఇక ఈ పాలీగ్రాఫ్ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్‌ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు, ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నాయి. అంతేగాక, తాను సెమినార్‌ హాల్‌కు వెళ్లేసరికి వైద్యురాలు చనిపోయి ఉందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్‌ చెప్పినట్లు ఆయా కథనాలు వెల్లడించాయి.

డిఫెన్స్ లాయర్​ లేకుండానే పాలీగ్రాఫ్ టెస్ట్
ఈ హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్‌కు కోర్టు ఆదేశాలతో సీబీఐ పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్‌ పరీక్ష చేపట్టారు. మరోవైపు నిందితుడికి పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్‌ లాయర్‌ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిందితుడి తరుఫు న్యాయవాది తెలిపారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు.

'కావాలనే ఇరికించారు'
వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ అంతకుముందు కోల్‌కతా పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి చెందిన వైద్యబృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతీ నిమిషం జరిగిన విషయాలను నిందితుడు గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపర్చగా తానే తప్పు చేయలేదని, కావాలనే ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

హత్యాచారం కేసు ప్రధాన నిందితుడికి లై డిటెక్షన్‌ టెస్ట్‌- మాజీ ప్రిన్సిపల్ ఆస్తులపై సీబీఐ నజర్​! - Kolkata Doctor Case

నేను ఏ తప్పూ చేయలేదు- కుట్రపూరితంగా ఇరికించారు: కోల్​కతా హత్యాచార నిందితుడు! - Kolkata Doctor Murder Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.