ETV Bharat / bharat

'మాకు రావాల్సిన నిధులన్నీ ఇవ్వాలి'- దిల్లీలో కర్ణాటక కాంగ్రెస్​ ఆందోళన - karnataka congress news today

Karnataka Congress Protest : పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కర్ణాటక కాంగ్రెస్​ దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆందోళన చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్​ ఆందోళనకు కౌంటర్​గా కర్ణాటక సర్కారు వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ విధానసౌధ వద్ద నిరసనకు దిగింది.

Karnataka Congress Protest
Karnataka Congress Protest
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 1:50 PM IST

Karnataka Congress Protest : రాష్ట్ర, కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కర్ణాటక కాంగ్రెస్​ దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కేంద్రం తమకు కేటాయించాల్సిన అన్ని నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలో చేపట్టిన ఈ ఆందోళనకు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా పన్నుల వాటా పంపిణీ, గ్రాంట్​ ఇన్​ ఎయిడ్లో అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్​ ఆరోపిస్తోంది.

"దేశంలో అధికంగా పన్నలు చెల్లించే రాష్ట్రాల్లో మొదట మహారాష్ట్ర ఉంటే, కర్ణాటకది రెండో స్థానం. ఈ ఏడాది సుమారు రూ.4.30లక్షల కోట్లు పన్నుల రూపంలో కట్టాం. మేము కేంద్రానికి రూ.100 ట్యాక్స్​ కడితే, ప్రభుత్వం తిరిగి మాకు కేవలం రూ.12-13 మాత్రమే చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మా నిరసనను పరిశీలిస్తుందని అనుకుంటున్నాం. కన్నడిగుల, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే మా ప్రధాన ఉద్దేశం. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా మాతో కలిసి రావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తాలి."

--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

కేంద్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్​లో అప్పర్​ భద్ర ప్రాజెక్ట్​కు రూ.5300 కోట్లు కేటాయించినా, ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దీనిని బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ఆందోళన కాదని, కర్ణాటక అణచివేతకు వ్యతిరేకంగా చేస్తోందన్నారు. 14వ ఆర్థిక సంఘం అనుసరించిన విధానాన్ని 15వ ఆర్థిక సంఘం మార్చి, తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు.

"మా హక్కులను మేం అడుగుతున్నాం. మేము పొందాల్సిన వాటాలో 13శాతం మాత్రమే లభిస్తుంది. ఇతర రాష్ట్రాలు లబ్ధి పొందింతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గుజరాత్​కు కేంద్రం కేటాయించే అన్ని పథకాలు, విధానాలు మాకు కూడా అమలు చేయాలి."

--డీకే శివకుమార్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

కాంగ్రెస్​ వైఫల్యాలపై బీజేపీ ఆందోళన
మరోవైపు కాంగ్రెస్​ ఆందోళనకు కౌంటర్​గా కర్ణాటక సర్కారు వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ నిరసనకు దిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర నేతృత్వంలో విధానసౌధ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాాహకాలు, రైతులకు సహాయ నిధులను విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.