Kanwar Yatra UP: కావడి యాత్రకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాత్ర మార్గంలోని హోటళ్ల యజమానులు నేమ్‌ప్లేట్లపై పేర్లను ప్రదర్శించాలనే ఆదేశాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీసేలా ఈ ఆదేశాలు ఉన్నాయని మండిపడుతున్నాయి. అయితే బీజేపీ, వీహెచ్‌పీ నేతలు మాత్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాయి.
కావడి యాత్రకు వెళ్తున్న భక్తులు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో సులభంగా తెలుసుకునేందుకు దోహదపడేలా ఆదేశాలు ఉన్నాయని వాదిస్తున్నాయి. దీన్ని మతపరమైన కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నాయి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ ఇప్పటికే ఈ తరహా ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ అంశంపై అధికార, విపక్ష నేతలు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.
ముస్లింలు, దళితుల హక్కులను హరించే కుట్ర: రాహుల్ గాంధీ
'బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఒకవేళ వాళ్లకు 400 కంటే ఎక్కువ లోక్‌సభ సీట్లు వచ్చి ఉంటే ఇంకా ఏమేం చేసి ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్లంతా కావడి యాత్రకు సంబంధించి యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్‌ను చూసైనా కళ్లు తెరవాలి. ముస్లింలు, దళితుల హక్కులను హరించాలనే కుట్రతో బీజేపీ ఉంది' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
'వికసిత్ భారత్'కు మార్గం ఇదేనా? : కపిల్ సిబల్
'కావడి యాత్ర మార్గంలోని అన్ని తినుబండారాల దుకాణాల యజమానులు పేర్లను ప్రదర్శించాలని యూపీ సర్కారు ఆదేశించడం సరికాదు. ఇది విభజన ఎజెండాతో తీసుకున్న నిర్ణయం. 'వికసిత్ భారత్' కోసం వేసిన మార్గం ఇదేనా? ' అని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
రాజ్యాంగ ఉల్లంఘన: మెహబూబా ముఫ్తీ
కావడి యాత్రకు సంబంధించి యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇచ్చిందని గుర్తుచేశారు. ఎవరిపైనా వివక్ష చూపేందుకు రాజ్యాంగం అనుమతించదని ఆమె తెలిపారు.
#WATCH | Srinagar, J&K: On 'nameplates' on food shops on the Kanwar route in Uttar Pradesh, PDP Chief Mehbooba Mufti says, " ...our constitution gives equal rights, does not want to discriminate against anyone...they (bjp) are violating the constitution. rahul gandhi rightly said… pic.twitter.com/QqORuEuRLl
— ANI (@ANI) July 20, 2024
జాతి ఐక్యత విచ్ఛిన్నం: సంజయ్ రౌత్
దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకే యూపీలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని ఉద్ధవ్ వర్గం శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. కావడి యాత్ర మార్గంలోని ఫుడ్ స్టాల్స్ నిర్వాహకుల్లో ఎవరు ఏ మతస్తులు అనేది తెలుసుకునేందుకే నేమ్ ప్లేట్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల బీజేపీకి లాభం చేకూరదన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారానికి బానిసలుగా మారి బీజేపీ ప్రభుత్వాల తప్పుడు విధానాలను గుడ్డిగా సమర్దిస్తున్నాయని రౌత్ చెప్పారు.
విపక్షాలువి బుజ్జగింపు రాజకీయాలు: యూపీ డిప్యూటీ సీఎం
విపక్షాలకు మతిపోయిందని అందువల్లే అవి తమ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 'విపక్ష నేతలు కూడా కావడిలను తీసుకొని హరిద్వార్‌కు వెళ్లి శివుడిని పూజించాలి. కనీసం అప్పుడైనా వాళ్లకు తెలివిలో వచ్చిన వైకల్యం నయం అవుతుంది' అని ఆయన సూచించారు. విపక్షాలకు ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియదని మండిపడ్డారు.
#WATCH | Srinagar, J&K: On 'nameplates' on food shops on the Kanwar route in Uttar Pradesh, PDP Chief Mehbooba Mufti says, " ...our constitution gives equal rights, does not want to discriminate against anyone...they (bjp) are violating the constitution. rahul gandhi rightly said… pic.twitter.com/QqORuEuRLl
— ANI (@ANI) July 20, 2024
సోనూ సూద్ స్పందన- కంగనా రనౌత్ రిప్లై
కావడి యాత్రకు సంబంధించి యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ స్పందించారు. ఆమె ఈసారి నటుడు సోనూ సూద్‌ను తన టార్గెట్‌గా ఎంచుకున్నారు. యూపీ సర్కారు ఆదేశాలతో విభేదించిన సోనూ సూద్ 'అన్ని షాపుల నేమ్‌ప్లేట్‌లపై 'HUMANITY' (మానవత్వం) అని మాత్రమే ప్రదర్శించాలి' అంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. దీనికి కంగనా రనౌత్ కౌంటర్ ఇస్తూ 'నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. హలాల్ స్థానంలో హ్యుమానిటీ అని డిస్‌ప్లే చేస్తే సరిపోతుంది' అని పేర్కొన్నారు. దీనిపై వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని సోనూ సూద్‌ను ఆమె ప్రశ్నించారు.
Agree, Halal should be replaced with “ HUMANITY” https://t.co/EqbGml2Yew
— Kangana Ranaut (@KanganaTeam) July 19, 2024
నాజీ జర్మనీని తలపిస్తున్నారు : జావెద్ అఖ్తర్
'సమీప భవిష్యత్తులో యూపీలోని అన్ని రెస్టారెంట్లు, వాహనాలపై యజమానుల పేర్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చేలా ఉన్నారు. ఎందుకలా చేస్తున్నారు? నాజీ జర్మనీ హయాంలోనూ దుకాణాలు, ఇళ్లపై ఒక గుర్తును డిస్‌ప్లే చేసేవారు' అని సినీరంగ ప్రముఖుడు జావెద్ అఖ్తర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
మతాల కోణం లేదు: బంగాల్ బీజేపీ చీఫ్
'కావడి యాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసమే యూపీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మతాల కోణం లేదు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కావడి యాత్ర టైంలోనే కాదు ఏడాది పొడవునా షాపుల నేమ్ ప్లేట్లపై యజమాని పేరు ఉండాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. గతంలో అఖిలేష్ యాదవ్ హయాంలోనూ ఇలాంటి ఉత్తర్వు ఒకటి జారీ అయింది' అని బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ తెలిపారు.
#WATCH | Delhi: On 'nameplates' on food shops on the Kanwar route in Uttar Pradesh, West Bengal BJP President Sukanta Majumdar says, " the opposition is misleading people... such a notification was issued in akhilesh yadav's government and a notification has been issued in the bjp… pic.twitter.com/L2cD2gPSbq
— ANI (@ANI) July 20, 2024
జులై 22 నుంచి కావడి యాత్ర మార్గాలివీ
కావడి యాత్ర జులై 22 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు పవిత్ర గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. ఈ యాత్రకు వెళ్లే మార్గాలు ప్రధానంగా నాలుగు. వీటిలో ఒక యాత్రా మార్గం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభమై ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం వరకు ఉంటుంది. రెండో యాత్రా మార్గం యూపీలోని వారణాసిలో మొదలై ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌లో ముగుస్తుంది. మూడో యాత్రా మార్గం యూపీలోని బారాబంకీలో మొదలై గోండాలో ముగుస్తుంది. తూర్పు యూపీలో మరో కావడి యాత్రా మార్గం ఉంది.
శివయ్యకు కావిళ్లతో గంగ- కాలినడకనే ప్రయాణం- కన్వర్ యాత్ర విశేషాలివే! - Kanwar Yatra 2024