ETV Bharat / bharat

జపాన్ నుంచి వచ్చి భారతీయ నృత్యంలో ప్రావీణ్యం- స్వదేశంలో విద్యార్థులకు శిక్షణ - జపాన్ యువతి కల్బెలియా డాన్స్

Japan Girl Performed Kalbelia Dance : డ్యాన్స్​ను నేర్చుకునేందుకు జపాన్​ నుంచి ఇండియాకు వచ్చింది ఓ యువతి. ఇక్కడి సంస్కృతికి ఆకర్షితురాలైన ఆ యువతి నృత్యంతో పాటు జానపద పాటలను కూడా పాటడం నేర్చుకుంది. కేవలం నేర్చుకోవడమే కాదు తిరిగి వాళ్ల దేశస్థులకు కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. అలానే వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఔరా అనిపిస్తోంది. ఇంతకీ ఆ యువతి ఎవరు?

Japan Girl Performed kalbelia Dance
Japan Girl Performed kalbelia Dance
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 10:09 PM IST

జపాన్ నుంచి వచ్చి భారతీయ నృత్యంలో ప్రావీణ్యం- స్వదేశంలో విద్యార్థులకు శిక్షణ

Japan Girl Performed Kalbelia Dance : ఓ సినిమాలో చూసిన డ్యాన్స్​ను నేర్చుకునేందుకు 11 ఏళ్ల క్రితం భారత్​కు వచ్చిన జపాన్ యువతి ఆ కళలో ప్రావీణ్యం సంపాదించి తమ దేశస్థులకు నేర్పించే స్థాయికి చేరుకుంది. జపాన్​కు చెందిన మయూమి అలియాస్ మధు కల్బెలియా నృత్యం నేర్చుకునేందుకు 2013లో రాజస్థాన్​కు వచ్చింది. డ్యాన్స్​తో పాటు జానపద గీతాలను కూడా పాడటం నేర్చుకుంది. తిరిగి తన దేశానికి వెళ్లి అక్కడి వాళ్లకు కూడా ఈ నృత్యాన్ని, సంగీతాన్ని నేర్పిస్తోంది.

Japan Girl Performed kalbelia Dance
జపాన్​ విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న మధు

మధు 2013లో రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన ఆశా సపేరా అనే కళాకారిణి దగ్గర శిక్షణ తీసుకునేందుకు వచ్చింది. భారత సంస్కృతికి ముగ్ధురాలై తన పేరును మధుగా మార్చుకుంది. ఆ తర్వాతి నుంచి రాజస్థాన్​కు వచ్చినప్పుడల్లా నృత్యంతో పాటు జానపద పాటలు పాడటం నేర్చుకుంటూ ఉండేది. వాటిని వీడియో తీసి జపాన్​కు వెళ్లిన తర్వాత స్వయంగా ప్రాక్టీస్​ చేస్తుండేది. అలా 2015 నాటికి కల్బెలియా డ్యాన్స్​ను పూర్తిగా నేర్చుకుంది.

Japan Girl Performed kalbelia Dance
రాజస్థానీ జానపద గీతాలు నేర్చుకుంటున్న మధు

జపాన్ విద్యార్థులకు శిక్షణ
రాజస్థాన్​ను తనకు రెండో ఇల్లు అని అంటోంది మధు. కల్బెలియా డ్యాన్స్​తోపాటు ఘూమర్ నృత్యం, మార్వాడీ పాటలు, రాజస్థానీ జానపద గీతాలు నేర్చుకుంది. జపాన్​లోని భారత రాయబార కార్యలయంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చింది మధు. అలాగే ప్రతి ఆదివారం టోక్యోలోని విద్యార్థులకు నృత్యంతో పాటు రాజస్థానీ పాటలు పాటడం నేర్పుతోంది. ప్రస్తుతం తన దగ్గర 20 మంది విద్యార్థులు ఈ రాజస్థానీ కళను నేర్చుకున్నట్లు మధు తెలిపింది.

Japan Girl Performed kalbelia Dance
కల్బెలియా నృత్య ప్రదర్శన ఇస్తున్న మధు

"కల్బెలియా నృత్యంతో పాటు మార్వాడీ పాటలు పాడటం నేర్చుకున్నాను. అలానే స్టూడెంట్స్​కు మార్వాడీ పాటలను పాటడం నేర్పిస్తున్నాను. వాళ్లు ఈ పాటలను నేర్చుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. అలానే లిరిక్స్ రాయటం కూడా నేర్పిస్తున్నాను."
- మధు, కల్బెలియా నృత్య కళాకారిణి

ఇటీవలే జైపుర్​లో రిఫ్ ఫిల్మ్​ క్లబ్​ నిర్వహించిన రాజస్థాన్ ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్​ పదో ఎడిషన్​లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకుంది మధు. రాజ్​పుతి ఘూమర్ నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది.

మహిళా న్యాయమూర్తి భరతనాట్యం- చప్పట్లతో మార్మోగిన ఆడిటోరియం

భగవద్గీతను ఉర్దూలోకి అనువదించిన ముస్లిం- మన బోధన్ అమ్మాయే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.