ETV Bharat / bharat

స్మోక్​ పాన్, బిస్కెట్​ సరదా కాదు, ప్రాణాంతకం! ఎవరూ తినొద్దని ప్రభుత్వం వార్నింగ్! - Is Nitrogen Biscuit Harmful - IS NITROGEN BISCUIT HARMFUL

Is Nitrogen Biscuit Harmful : బాలుడు స్మోక్ బిస్కట్‌ను తిని మూర్ఛపోయిన వైరల్ వీడియో నేపథ్యంలో ఇలాంటి నైట్రోజన్ ఆధారిత బిస్కెట్లు లేదా పాన్ విక్రయాల కోసం దుకాణాలు, హోటళ్లను ఆడిట్ చేస్తామని తమిళనాడులోని ఆహార శాఖ ప్రకటించింది. చూడటానికి సరదాగా ఉండే ఈ చర్య ఎలాంటి అసౌకర్యానికి గురిచేస్తుందో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

Is Nitrogen Biscuit Harmful
Is Nitrogen Biscuit Harmful
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 2:29 PM IST

Is Nitrogen Biscuit Harmful : నైట్రోజన్‌తో తయారు చేసే స్మోక్‌ బిస్కెట్లు, పాన్‌లను విక్రయించవద్దని తమిళనాడు ప్రభుత్వం వ్యాపారులను ఆదేశించింది. వినియోగదారుల ఆరోగ్యంపై ఇవి చూపే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై 'ఈటీవీ భారత్‌'తో తమిళనాడు ఆహారశాఖ అధికారి ప్రత్యేకంగా మాట్లాడారు. వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ ముఖాముఖిలో ప్రస్తావించారు.

ద్రవరూపంలోని నైట్రోజన్‌తో తయారు చేసిన స్మోక్​ బిస్కెట్‌ తిని ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్​ అయింది. అది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. స్మోక్‌ బిస్కెట్‌ రుచిచూసిన ఒక బాలుడు తీవ్ర నొప్పితో అల్లాడుతూ మూర్ఛపోయినట్లు ఆ వైరల్ వీడియోలో ఉంది. ఆ దృశ్యాలు నెటిజన్లను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. ఈ ఘటనతో స్కోక్‌ బిస్కెట్లు, పాన్​పై చర్చ మొదలైంది. పలువురు ప్రముఖులు దీనిని నిషేధించాలంటూ సోషల్​ మీడియాలో పోస్ట్‌లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.

బాలుడు సేఫ్​
లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేసిన 'స్మోక్ బిస్కెట్'ను తిని మూర్ఛపోయిన బాలుడు సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. వైద్యులు సకాలంలో చికిత్స చేయడం వల్ల ప్రాణాలు దక్కాయని చెప్పారు.
తల్లిదండ్రులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లిన బాలుడు, నైట్రోజన్ స్మోక్​ బిస్కెట్ తిన్నాడు. వెంటనే అతడి నోటి నుంచి పొగలు రావడం చూసి తల్లిదండ్రులు ఎంజాయ్ చేశారు. ఇంతలో బాలుడు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాడు. నొప్పితో విలవిలలాడాడు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. చూస్తుండగానే బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. గడ్డకట్టే స్వభావం ఉన్న లిక్విడ్ నైట్రోజన్‌ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు జాగ్రత్త
స్మోక్‌ పాన్‌, బిస్కెట్లు తినవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు సూచించింది. లిక్విడ్‌ నైట్రోజన్‌ను జీరో డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు అనుమతి ఉందని, కానీ దానిని అనుమతించిన వాటికే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఏ రూపంలోనైనా ద్రవరూపంలో ఉన్న నైట్రోజన్‌ను ఆహారంగా తీసుకుంటే, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమిళనాడు ప్రభుత్వ ఆహార శాఖ అధికారి ఈటీవీ భారత్‌కు చెప్పారు. ఇప్పటికే పలు దుకాణాలు, హోటళ్లకు ఇలాంటి స్మోక్‌ ఆహార పదార్థాలను విక్రయించవద్దని ఆదేశించామని తెలిపారు. ద్రవ నైట్రోజన్‌ను నిల్వ చేయాలంటే మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్ అవసరమని, అందుకే అది పొగలు వస్తుంటుందని కూడా వెల్లడించారు.

మరోవైపు పిల్లలు వాటిని తినకూడదని షాపుల్లో అమ్మకూడదని ఇప్పటికే ఆదేశించినట్లు చెన్నై జిల్లా ఆహార భద్రత విభాగం అధికారి సతీశ్ కుమార్ తెలిపారు. "ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సలహాలు మాత్రమే ఇవ్వగలదు. అటువంటి ఉత్పత్తులను విక్రయించకుండా దుకాణాలను ఆపడం సాధ్యం కాదు. వాటి నియంత్రణ, అమలు ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. వారే ఓ నిర్ణయం తీసుకోవాలి" అని సతీశ్‌ కుమార్‌ ఈటీవీ భారత్‌కు తెలిపారు.

డాక్టర్లు ఏమంటున్నారంటే?
"ద్రవ నైట్రోజన్‌ను మైనస్‌ 196 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఇది బయటకు తీసి ఏ వ్యక్తైనా ఆహారంగా తీసుకుంటే కచ్చితంగా హాని కలుగుతుంది." అని డాక్టర్ సగయా ప్రిన్స్ తెలిపారు. ద్రవ నైట్రోజన్‌ శరీరంలోకి వెళ్లిన వెంటనే అవయవాలను స్తంభింపజేస్తుందని కూడా వివరించారు. లిక్విడ్‌ నైట్రోజన్‌ వల్ల కణజాలం దెబ్బ తింటుందని, చల్లని నైట్రోజన్ ఆవిరి కావడం వల్ల శరీరం లోపల కాలిన గాయాలు కావచ్చని ఉటా స్టేట్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. లిక్విడ్‌ నైట్రోజన్‌కు రంగు, రుచి, వాసన ఉండదని నిపుణులు వివరించారు. లిక్విడ్‌ నైట్రోజన్‌ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆక్సిజన్‌ అందక మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడని వైద్యులు చెబుతున్నారు. అధిక మొత్తంలో నైట్రోజన్‌ పీల్చడం వల్ల మైకం, వికారం, వాంతులు, స్పృహ కోల్పోవడం చివరికి మరణం కూడా సంభవించవచ్చని అంటున్నారు.

కేరళ పాలిటిక్స్​లో ట్విస్ట్ - 'ట్వంటీ20' దూకుడు- ప్రధాన పార్టీలకు టెన్షన్! - Lok Sabha Election 2024

'మోదీ అలా ఎందుకు మాట్లాడారు?'- సమాధానం చెప్పాలని బీజేపీకి ఈసీ ఆదేశం - Lok Sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.