QS World University Rankings 2025 : క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మంగళవారం విడుదల అయ్యాయి. అందులో భారత్‌కు చెందిన ఐఐటీ దిల్లీ 255 స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచవ్యాప్తంగా 171వ ప్లేస్‌కు చేరింది. సస్టేనిబిలిటీలో ఐఐటీ దిల్లీ ఈ ర్యాంక్ సాధించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), బెంగళూరు పర్యావరణ విద్యలో ప్రపంచంలోని టాప్ 50 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మొత్తంగా భారత్ నుంచి 78 విశ్వవిద్యాలయాలు 2025 క్యూఎస్ సస్టేనిబిలిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో భారత్‌లోని టాప్ 10 విద్యాసంస్థల్లో 9 ఇన్స్టిట్యూషన్లు తమ స్థానాల్ని మెరుగుపరుచుకున్నాయి. ఇక ఈ జాబితాలో భారత్ నుంచి కొత్తగా 21 ఉన్నత విద్యాసంస్థలు చేరాయి. పర్యావరణ ప్రభావానికి సంబంధించి ఐఐటీ దిల్లీ, ఐఐటీ-కాన్పుర్ ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో ఉన్నాయి.
"భారత ఉన్నత విద్యా వ్యవస్థకు ఇది అద్భుతమైన విజయం. భారతీయ విశ్వవిద్యాలయాలు తమ స్థిరత్వ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయని అడానికి ఇధి నిదర్శనం. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, ఎంప్లాయబిలిటీలో మెరుగైన స్కోర్‌లను సాధించాయి." అని లండన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ బెన్ సోటర్ తెలిపారు.
ఆ యూనివర్సిటీకే ఫస్ట్ ర్యాంక్!
ఇక ఈ జాబితాలో టొరొంటో యూనివర్సిటీ టాప్ ర్యాంక్ సాధించింది. ఈటీహెచ్ జూరిచ్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్ని, బెర్క్లీ(యూసీబీ) సంయుక్తంగా మూడో స్థానాన్ని సాధించాయి.
107 దేశాలు, ప్రాంతాల నుంచి 1740 విశ్వవిద్యాలయాలకు ఈ జాబితాలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. గత ఎడిషన్‌లో 95 లొకేషన్ల నుంచి 1397 విద్యాసంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, తాజా ర్యాంకింగ్స్‌లో గతేడాది కంటే గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది.