ETV Bharat / bharat

క్యాట్​ను ఆశ్రయించిన ఐఏఎస్​లు - ఆమ్రపాలి సహా నలుగురు​ పిటిషన్​ దాఖలు - IAS OFFICERS APPROACHED TO CAT

డీఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరిన ఐఏఎస్‌లు - రేపు విచారణ చేపట్టనున్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్

Telangana IAS Officers Approached To CAT
IAS Officers Approached To CAT (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 4:21 PM IST

Updated : Oct 14, 2024, 4:54 PM IST

IAS Officers Approached To CAT : కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్​ సైతం జారీ చేశారు. అయితే డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు ఐఏఎస్‌ అధికారులు ఇవాళ క్యాట్‌ను ఆశ్రయించారు.

డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజన క్యాట్‌లో వేర్వేరుగా పిటిషన్‌లు ఫైల్​ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి కోరగా, ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన విన్నవించారు. ఈ పిటిషన్లపై క్యాట్​ మంగళవారం విచారణ చేపట్టనుంది.

ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్స్​ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్‌ కేడర్​కు చెందిన అధికారులు అంజనీ కుమార్, అభిలాశ్​ బిస్త్, అభిషేక్‌ మహంతి ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణకు వెళ్లాలని అప్లికేషన్​ పెట్టుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్​ చేసింది. వీరిద్దరూ ఏపీలోనే కొనసాగుతారు.

ఇదీ వివాదం : ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్​ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్​ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, సంతోశ్​ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్​కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్​ను తెలంగాణకు కేటాయించారు.

విభజన తీరుపై అబ్జెక్షన్​ చేస్తూ వీరందరూ 2014లో క్యాట్​ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోశ్​ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ సెంట్రల్​ గవర్నమెంట్​ పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్​లకు కేంద్రం షాక్ - తెలంగాణకు కేటాయించాలన్న అభ్యర్థన తిరస్కరణ

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Last Updated : Oct 14, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.