How To Prepare Chicken Fry At Home : చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ, ఎన్నిసార్లు వండినా కూడా మళ్లీ మళ్లీ తినాలనిపించే కర్రీ మాత్రం చికెన్ ఫ్రై మాత్రమే! బాగా మసాలాలు వేసి ఒక్కసారి చికెన్ ఫ్రై రెడీ చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది చికెన్ ఫ్రైకి కాంబినేషన్‌గా పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ఎప్పుడూ చేసే పచ్చిపులుసు కాకుండా మామిడికాయతో పచ్చిపులుసును తయారు చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. మరి ఈ వంటలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
చికెన్ ఫ్రై చేయడానికి కావాల్సిన పదర్థాలు :
- బోన్‌లెస్ చికెన్ - అర కిలో
- కారం- రుచికి సరిపడా
- పసుపు- ఒక చిన్న టేబుల్ స్పూన్
- ఉప్పు -రుచికి సరిపడా
- ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు - 5
- దాల్చిన చెక్క - కొద్దిగా
- లవంగాలు - 4
- ఎండు మిరపకాయలు - నాలుగు
- జీలకర్ర - 1 టీస్పూన్
- మిరియాలు -1/2 టీస్పూన్
- నూనె - 3 టేబుల్ స్పూన్‌లు
- ఉల్లిపాయలు - రెండు
- పెరుగు - కప్పు
- పచ్చిమిర్చి - నాలుగు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు
చికెన్ ఇలా చుట్టేసి ఇవ్వండి - పిల్లలు "మమ్మీ యమ్మీ" అంటూ లాగిస్తారు!
చికెన్ ఫ్రై తయారు చేయు విధానం :
- ముందుగా ఓ గిన్నెలోకి చికెన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ధనియాలు, జీడిపప్పు, దాల్చినచెక్క, లవంగాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి.
- తర్వాత మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కప్పు పెరుగు వేసి మిక్స్ చేయాలి.
- తర్వాత మూతపెట్టి చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
- చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే సింపుల్‌గా చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు.
How To Make Mamidikaya Pachi Pulusu : ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్‌గా మామిడికాయ పచ్చిపులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మామిడికాయ పచ్చిపులుసుకు కావాల్సిన పదార్థాలు :
- పచ్చి మామిడికాయలు - 1(పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకోటి తీసుకోవచ్చు)
- ఉప్పు సరిపడినంత
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 4
- ఎండు మిర్చి - 2
- మెంతులు - 1 టీస్పూన్
- ధనియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- నువ్వులు - 1 టీస్పూన్
మామిడి కాయ పచ్చిపులుసు తయారీ విధానం :
- ముందుగా పచ్చి మామిడికాయలను బాగా కాల్చుకోవాలి. తర్వాత తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- అలాగే పచ్చి మిరపకాయలను కూడా కాల్చుకోవాలి.
- ఇప్పుడు ఒక పాన్‌లో మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండు మిర్చి వేసుకుని వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాల్చిన పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మామిడికాయ గుజ్జు వేసి బాగా కలపాలి.
- తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుని ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం టేస్ట్‌కు సరిపోయే విధంగా చూసుకోవాలి.
- ఒక గిన్నెలో పోపు రెడీ చేసుకుని, పచ్చిపులుసులో వేసుకుంటే సరిపోతుంది.
- అంతే ఇలా సింపుల్‌గా పచ్చిమామిడికాయ పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఈ రెండు రెసిపీలను ట్రై చేయండి.
వీకెండ్ స్పెషల్ - చింతచిగురు మటన్ ! ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!
వీకెండ్ స్పెషల్ : పుల్ల పుల్లని స్పైసీ మామిడికాయ చికెన్ ఫ్రై - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!