ETV Bharat / bharat

అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్​లా తాగేయొచ్చు! - Tomato Rasam Recipe - TOMATO RASAM RECIPE

Tomato Rasam Recipe In Telugu : భోజనంలో కూర, పచ్చడి, పెరుగు లాంటివి ఉన్నా సరే.. కొందరికి పులుసు లేదా చారు కావాల్సిందే. ముఖ్యంగా.. పుల్లపుల్లగా ఉండే టమాటా చారును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు నిమిషాల్లోనే అద్దిరిపోయే టమాటా చారు ప్రిపేర్ చేసుకోవచ్చు!

How To Make Tomato Rasam
Tomato Rasam Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 1:51 PM IST

How To Make Tomato Rasam Recipe : మనలో చాలామందికి ఎన్ని కూరలు, వేపుళ్లు ఉన్నా.. కాస్త రసంతో తినే అలవాటు ఉంటుంది. అలా తినకపోతే కడుపునిండా భోజనం చేసినట్లుగా ఉండదు. అయితే, రసాల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. టమాటా రసం టేస్టే వేరు. దీన్నే టమాటా చారు అని కూడా అంటారు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో పాటు టమాటా రసం వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరే లెవల్​గా ఉంటుంది!

అయితే.. కొంతమందికి టమాటా(Tomato) చారు ఎంత బాగా చేసినా కొన్నిసార్లు సరిగ్గా కుదరదు. అందుకే.. మీ కోసం ఈ టమాటా చారు రెసిపీ. దీనికోసం ఎంతో శ్రమించాల్సిన పనిలేదు.. నిమిషాల్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. అలాగే దీన్ని అన్నంలో తినడమే కాకుండా సూప్​లా కూడా తాగేయొచ్చంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. మరి.. ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - కొన్ని(పండినవి)
  • పచ్చిమిర్చి - నాలుగు
  • ఉల్లిపాయలు - రెండు(నిలువుగా తరుక్కోవాలి)
  • నూనె - రెండు చెంచాలు
  • ఉప్పు, కారం - రుచికి సరిపడా
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - కొద్దిగా
  • కొద్దిగా కొత్తిమీర తరుగు

టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలా? - ఇలా చేస్తే చాలా రోజులు ఉంటాయి!

టమాటా రసం తయారీ విధానం :

  • ముందుగా కొన్ని పండిన టమాటాలు తీసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్లు కాస్త చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు పండిన టమాలను కాస్త మీడియం సైజ్​లో కట్ చేసుకొని ఉడికించుకోవాలి.
  • ఆపై అవి చల్లారాక చేత్తో పేస్ట్​లాగా చేసుకోవాలి. ఆ తర్వాత వడకట్టి కేవలం రసాన్ని మాత్రమే ఒక బౌల్​లోకి పోసుకోవాలి.
  • అయితే, ఓపిక తక్కువ ఉన్నవాళ్లు ఉడికించిన టమాటాలను మిక్సీలో వేసుకుని కూడా వడకట్టుకోవచ్చు.
  • ఆ తర్వాత స్టౌ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో రెండు చెంచాల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కొన్ని తాలింపు గింజలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఆపై అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంతవరకు సన్నని మంట మీద ఉంచాలి.
  • ఇప్పుడు మీరు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టమాటా రసాన్ని ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి.
  • రసం కాస్త వేడెక్కాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. అవసరమైతే చారు కాస్త ఘాటుగా ఉండాలనుకునేవాళ్లు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇష్టం ఉన్నవాళ్లు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
  • అదేవిధంగా టమాటాల్ని ఉడకబెట్టేటప్పుడే కాస్త ధనియాలు వేస్తే మరోరకం టేస్ట్ వస్తుంది. ఈ రకం రసాన్ని ఇష్టపడేవాళ్లు కూడా చాలామంది ఉంటారు.
  • చివరగా.. చారుని మీడియం ఫ్లేమ్ మంట మీద కమ్మటి వాసన వచ్చేంతవరకు మరిగించుకోవాలి. అంతే.. నోరూరించే రుచికరమైన టమాటా రసం రెడీ!

ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.