How To Make Chapathi Kurma : సండే వచ్చిందంటే మాగ్జిమమ్ ఇళ్లలో నాన్ వెజ్ ఘుమఘుమలుంటాయి. అయితే.. కొందరు స్పెషల్‌గా చపాతీలు తయారు చేసుకుంటారు. నాన్ వెజ్ తినని పిల్లలు, పెద్దలు కూడా ఈ హాలీడే రోజున చపాతీలను ఓ పట్టు పడతారు. అయితే.. ఈ చపాతీలకు సైడ్ డిష్‌గా వివిధ రకాల కర్రీలను వండుకుంటారు.
కానీ.. స్పెషల్‌గా చపాతీల కోసం కుర్మా రెడీ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది. కేవలం.. శనగపిండి, టమాటా, కొద్దిగా శగనగపప్పు, ఉల్లిపాయాలతో అదిరిపోయే చపాతీ కుర్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాం. ఒక్కసారి ఈ కుర్మాతో కలిపి చపాతీలను తిన్నారంటే.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇదే కావాలంటారు. అంతేకాదు.. ఒకటికి రెండు చపాతీలు లాగిస్తారు. అంత బాగుంటుంది ఈ కుర్మా! మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ చపాతీ కుర్మాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా!
చపాతీ కుర్మా రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయ - 2
- జీలకర్ర, ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- శనగపప్పు- 3 టేబుల్ స్పూన్లు
- మినప పప్పు - 1 టేబుల్ స్పూన్
- పసుపు పొడి - 1/4 tsp
- కరివేపాకు - కొద్దిగా
- సోంపు - 1/2 tsp
- పచ్చిమిర్చి - 3 (తరిగినవి)
- ఉప్పు - రుచి ప్రకారం
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా
- టమాటాలు - 2
చికెన్ డోనట్స్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి! - Chicken Donuts Recipe Process
చపాతీ కుర్మా తయారు చేసే విధానం :
- ముందుగా ఒక గంట సేపు శనగపప్పును నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత పప్పును శుభ్రంగా కడిగి, అందులోకి సోంపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి.
- తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపపప్పు వేసి వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేయాలి.
- అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసి కొద్దిగా ఉడికించాలి.
- టామాటాలు మెత్తగా అయిన తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
- తర్వాత శనగపిండిని కుర్మాలోకి వేసుకుని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఈ రెసిపీని సన్నటి మంట మీద ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.
- తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని కుర్మాను సర్వ్ చేసుకుంటే చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది.
రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe