ETV Bharat / bharat

ఈ ఉగాదికి స్పెషల్ బొబ్బట్లు - పైనాపిల్‌తో అదరగొట్టేయండి! - How To Make Pineapple Bobbatlu - HOW TO MAKE PINEAPPLE BOBBATLU

How To Make Pineapple Bobbatlu : ఉగాది అనగానే మనందరికీ రకరకాల పిండివంటలు, ఉగాది పచ్చడి గుర్తుకు వస్తాయి. ఈ రోజున దాదాపుగా అందరూ బొబ్బట్లు చేస్తారు. అయితే.. ఎప్పుడూ బొబ్బట్లను సెనగపప్పు, కొబ్బరి, కోవా వంటి వాటితో చేస్తారు. కానీ.. ఈ సారి పైనాపిల్‌తో ట్రై చేయండి. టేస్ట్‌ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే!

How To Make Pineapple Bobbatlu
How To Make Pineapple Bobbatlu
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 10:49 AM IST

How To Make Pineapple Bobbatlu : ఉగాది పర్వదినానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ తెలుగు సంవత్సరాది రోజున చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ.. వివిధ రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అందులో కచ్చితంగా బొబ్బట్లు ఉంటాయి. ఈ బొబ్బట్లను సెనగపప్పు, రవ్వ వంటి వాటితో తయారు చేస్తుంటారు.

అయితే.. ఈ ఉగాది పండుగ వేళ మాత్రం సరి కొత్త బొబ్బట్లు తయారు చేయండి. అవే పైనాపిల్‌ బొబ్బట్లు. ఒక్కసారి ఈ పైనాపిల్‌ బొబ్బట్లు తిన్నారంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉండే పైనాపిల్ బొబ్బట్లను ఎలా ప్రిపేర్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ బొబ్బట్లు రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • మైదా 1 కప్పు
  • బెల్లం పొడి 1 కప్పు
  • కందిపప్పు 3/4 కప్పు
  • ఉప్పు సరిపడినంత
  • యాలకుల పొడి అర చెంచా
  • స్టార్ ఆనీ, జాజికాయ పొడి (1/2 స్పూన్)
  • పైనాపిల్ 2 కప్పులు (సన్నగా కట్‌ చేసుకోవాలి)
  • పసుపు పొడి 1/2 tsp
  • నీళ్లు
  • నెయ్యి

పైనాపిల్ బొబ్బట్ల తయారీ విధానం :

  • ముందుగా నానబెట్టుకున్న కంది పప్పును ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికిన తర్వాత దాన్ని మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి బెల్లం పౌడర్‌, జాజికాయ పొడి, యాలకుల పొడిని యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అలాగే సన్నగా తరిగిన పైనాపిల్‌ ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని నిమ్మపండు సైజ్‌లో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మైదా పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి చపాతీల పిండి లాగా కలుపుకోవాలి.
  • తర్వాత పిండిలోకి కొద్దిగా ఆయిల్‌ కూడా వేసుకోవాలి.
  • ఇప్పుడు మైదా పిండిని చపాతీలుగా చేసుకుని, వాటి మధ్యలో పైనాపిల్‌ మిశ్రమాన్ని పెట్టాలి.
  • తర్వాత చపాతీల పిండిని కప్పి బొబ్బట్లు తయారు చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ బొబ్బట్లను వేడివేడి పాన్‌ మీద కాస్త నెయ్యి వేసి, రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
  • అంతే.. ఇలా సింపుల్‌గా మిగతా బొబ్బట్లు అన్ని రెడీ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.
  • ఈ పైనాపిల్ బొబ్బట్లు తినేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.
  • సో.. మీరు కూడా ఈ పైనాపిల్‌ బొబ్బట్లు రెసిపీని ఈ ఉగాదికి ట్రై చేసేయండి.

A woman employs 20 women : భలే భలే పిండి వంటలతో.. బహు బాగు లాభాలు

సంక్రాంతి స్పెషల్ స్వీట్స్​ - వాహ్వా అనిపిస్తున్న 'ఘేవర్‌' మిఠాయి గురించి తెలుసా?

సీతాఫల్​ ఖీర్​ - టేస్ట్​ చేస్తే వహ్వా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.