ETV Bharat / bharat

పానీపూరీ బయట తింటే సకల రోగాలు - చక్కగా ఇలా ఇంట్లో చేసుకోండి! - అదే టేస్ట్​, సూపర్ క్వాలిటీ! - How to Make Pani Puri at Home

Pani Puri Making Process : మెజార్టీ జనాలకు ఇష్టమైన, కాదు కాదు.. చాలా చాలా ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌ "పానీపూరీ". రోజూ తిన్నా విసుగేయదు. కానీ.. బయట తినే పానీపూరీ వల్ల సివియర్​ హెల్త్​ ప్రాబ్లమ్స్​ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. మీకోసం ఈ పానీపూరీ రెసిపీ. తినాలనిపించినప్పుడల్లా చక్కగా ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్​తోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Pani Puri Making Process
Pani Puri Making Process (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 12:51 PM IST

How to Make Pani Puri at Home: పానీపూరీ.. గప్​చుప్​.. గోల్​గప్ప.. పేరు ఏదేనప్పటికీ దీనికున్న పాపులారిటీ కేక. కాలేజీ అమ్మాయి.. స్కూల్​కెళ్లే​ విద్యార్థి.. పనికెళ్లే బామ్మ.. ఇలా వయసు, జెండర్​తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిని తింటారు. అయితే.. ఒక్కటే సమస్య. వీధి వ్యాపారులు సరైన శుభ్రతపాటించకపోవడంతో ప్రమాదకరమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుంటే సరిపోతుంది. మరి.. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • బొంబాయి రవ్వ - 250 గ్రాములు
  • మైదా - పావు కప్పు(50 గ్రాములు)
  • ఉప్పు - కొద్దిగా
  • నీళ్లు - కొద్దిగా

మసాలా కోసం

  • తెల్ల ఎండు బఠాణి - 2 కప్పులు (రాత్రంతా నానబెట్టుకోవాలి)
  • నూనె - 50 ml
  • జీలకర్ర - 1 స్పూన్​
  • బిర్యానీ ఆకులు - 2
  • ఎండు మిర్చి -3
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​ స్పూన్​
  • పండిన టమాటలు - 2
  • ఉప్పు - సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూన్​
  • పసుపు - చిటికెడు
  • ధనియాల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • చాట్​ మసాలా - 1 టీ స్పూన్​

పానీ కోసం

  • పుదీనా తరుగు - 1 కట్ట
  • కొత్తిమీర తరుగు - 1 కట్టు
  • నిమ్మకాయ రసం - 1 చెంచా
  • ఉప్పు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 4
  • చింతపండు రసం - కొద్దిగా
  • బ్లాక్​ సాల్ట్​ - 1 టీ స్పూన్​
  • ఉప్పు - కొద్దిగా
  • కారం - 1 టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లో బొంబాయి రవ్వ, మైదా, ఉప్పు కొద్దిగా వేసి.. నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిపై తడిగుడ్డ కప్పి ఓ 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పిండిని కొంచెం పెద్ద ఉండలుగా చేసుకుని పూరీల్లా వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత రౌండ్​గా ఉండే కట్టర్​ లేదా చిన్న గిన్నె తీసుకుని పానీపూరీ సైజ్​లో కట్​ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. కట్​ చేసుకున్న వాటిని తడిగుడ్డ కప్పే ఉంచాలి వేయించుకునేంతవరకు.
  • ఇప్పుడు స్టౌ మీద అడుగు లోతుగా ఉండే కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడాక్కాక చేసుకున్న పూరీలను అందులో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇలానే అన్నింటిని చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మసాలా కోసం ప్రెషర్​ కుక్కర్​లో నానబెట్టిన తెల్ల ఎండు బఠాణి, లీటర్​ నీరు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద ఆరు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసుకుని జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • తర్వాత టమాట ముక్కలు వేసుకుని గుజ్జుగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, చాట్​ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో ఉడికించిన బఠాణీలను నీళ్లతో సహా వేసుకుని బాగా కలిపి.. మరో అర లీటర్​ నీళ్లు పోసి ఓ 20 నిమిషాలు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పానీ కోసం ఓ మిక్సీ జార్​ తీసుకుని అందులో పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్​గా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ పేస్ట్​ను వడకట్టాలి. అందుకోసం జల్లెడలో పేస్ట్​ వేసి లీటర్​ నీళ్లు పోసి జల్లించుకోవాలి.
  • అందులోకి చింతపండు రసం, బ్లాక్​ సాల్ట్​, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకుని.. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకోవాలి. అంతే పానీ సిద్ధం
  • ఈ మూడింటిని కలిపి తినడమే పానీపూరీ. ఇది ఇంట్లో చేసుకున్నారంటే.. మళ్లీ బయటతినమన్నా తినరు. అంత టేస్టీగా ఉంటాయి.

Panipuri : నోరూరించే పానీపూరీ.. దీని కథ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.