ETV Bharat / bharat

సండే స్పెషల్​ : మిలిటరీ మటన్​ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? - ఇలా ప్రిపేర్​ చేస్తే మసాలా నషాళానికి అంటుతుంది! - Military Mutton Curry

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 11:14 AM IST

Military Style Mutton Curry : బయట ఎప్పుడో ఒకసారి మిలిటరీ స్టైల్​​లో వండే మటన్​ కర్రీని టేస్ట్​ చేస్తుంటారు కొందరు. కానీ.. చాలా మందికి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు మటన్ తెచ్చినా.. ఒకే స్టైల్​ కర్రీ కుక్​ చేసుకునేవారే ఎక్కువ. అందుకే.. ఇవాళ "మిలటరీ మటన్​" తయారు చేయండి. మసాలా నషాళానికి అంటుతుంది!

Military Style Mutton
Military Style Mutton Curry (ETV Bharat)

How To Make Military Mutton Curry Recipe : నాన్​వెజ్​లో ఎన్ని రకాలున్నా.. మటన్​ లెక్కే వేరు. ఆ టేస్టే వేరు. అయితే.. చాలా మంది ఇంట్లోకి మటన్​ ఎప్పుడు తీసుకొచ్చినా.. రెగ్యులర్​ కర్రీ చేసుకుంటారు. అందుకే.. ఈసారి మిలిటరీ స్టైల్​లో మటన్​ కర్రీ చేసేయండి. ఇప్పటి వరకూ తినని సరికొత్త మటన్​ కర్రీని రుచి చూస్తారు. మిలిటరీ స్టైల్​ మటన్​ కర్రీ చేయడం అంటే.. దానికి చాలా పెద్ద తతంగం ఉంటుందని అనుకుంటారు చాలా మంది. కానీ.. చాలా సింపుల్​గా ఈ రెసిపీని తయారు చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మిలిటరీ స్టైల్​ మటన్​ కర్రీని ఎలా తయారు చేయాలో.. ఏమేం పదార్థాలు కావాలో.. తయారీ విధానం ఏంటో.. చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - అర కేజీ
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • పచ్చిమిర్చి - 8
  • పెరుగు - కప్పు
  • అల్లం - చిన్న ముక్క
  • పసుపు - టీస్పూన్
  • ఉల్లిపాయలు - 3
  • జీలకర్ర - టీస్పూన్
  • కారం - 2 టేబుల్ స్పూన్
  • గరం మసాలా-టేబుల్ స్పూన్
  • నూనె- మూడు టేబుల్​స్పూన్​లు
  • దాల్చిన చెక్క - చిన్నది
  • ఏలకులు-4
  • లవంగాలు - 3
  • మిరియాలు - 8
  • బిర్యానీ ఆకులు- 2
  • వాటర్ - సరిపడా
  • ఉప్పు - సరిపడా
  • కొత్తిమీర - కప్పు
  • పుదీనా - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 5 (పేస్ట్​ కోసం)
  • నెయ్యి - రెండు టీ-స్పూన్లు

మిలటరీ మటన్ కర్రీ తయారీ విధానం :

  • ముందుగా మటన్​ను రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
  • ఈ కర్రీ రుచిగా ఉండాలంటే.. ఇందులో కలిపే అల్లం వెల్లుల్లి పేస్ట్​ అప్పటికప్పుడు ఫ్రెష్​గా గ్రైండ్​ చేసుకోవాలి.
  • అలాగే మిక్సీ జార్​లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీ వేసి గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు గిన్నెలో మటన్​ వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్​, పచ్చిమిర్చి మిశ్రమం, పెరుగు, పసుపు, కారం, గరం మసాలా, కట్​ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. దీనిని గంట సేపు పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్​ వేసుకుని.. దాల్చిన చెక్క, జీలకర్ర, ఏలకులు, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు వేసి వేయించండి.
  • ఉల్లిపాయలు వేగిన తర్వాత మారినేట్​ చేసుకున్న మటన్​ వేసి 5 నిమిషాలు ఉడికించండి.
  • తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి.. మరొక 20 నిమిషాలు​ కుక్​ చేయండి.
  • మటన్​ మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించండి.
  • తర్వాత కొద్దిగా నెయ్యి, పుదీనా, కొత్తిమీర చల్లుకుని దించుకుంటే సరిపోతుంది.
  • ఇలా సింపుల్​గా చేస్తే వేడి వేడి మిలిటరీ మటన్​ కర్రీ రెడీ.
  • దీనిని వేడివేడి అన్నంలోకి, అలాగే రోటిలు, పుల్కాలతో కలిపి తింటే టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఈ సండే రోజు మీరూ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

చల్లని చిరుజల్లుల వేళ - ఇలా "చికెన్ సూప్" చేసుకొని సిప్ చేయండి - జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

జాతిరత్నాలు "ముర్గ్ ముసల్లం" : ఈ చికెన్​ రెసిపీ తిన్నారంటే - వారెవ్వా అనాల్సిందే!

జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్​తో సహా నాకేస్తారు! -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.