ETV Bharat / bharat

ఆంధ్రా స్టైల్​లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్​ టేస్ట్​! - Chicken Pickle

Chicken Pickle Recipe : నాన్​వెజ్​ పచ్చళ్లనగానే ఎక్కువ మందికి చికెన్ పచ్చడి మొదటగా గుర్తుకు వస్తుంది. అయితే, మెజార్టీ జనాలకు ఈ పచ్చడి ఎలా చేస్తారో తెలియదు. దీనిని చేయడం చాలా రిస్క్​ అనుకుని.. మార్కెట్లో దొరికే చికెన్ పచ్చడిని కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే అంధ్రా స్టైల్ చికెన్​ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Chicken Pickle Recipe
Chicken Pickle Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 4:28 PM IST

How To Make Chicken Pickle Recipe : ఎక్కువ మంది మాంసాహార ప్రియులు నాన్​వెజ్​ పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడితో తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే.. నాన్​వెజ్​లో ఎన్ని రకాల పచ్చళ్లున్నా.. చికెన్​ పచ్చడి రుచి అద్భుతంగా ఉండడమే దీనికి కారణం. అయితే, చాలా మందికి చికెన్​ పచ్చడి చేయడం రాదు. అదేదో పెద్ద ప్రాసెస్​ అని ఎప్పుడూ ఈ పచ్చడి ట్రై చేయరు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే.. ఎంతో సింపుల్​గా చికెన్​ పచ్చడిని మీరు ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే ఈ పచ్చడి కనీసం రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది! మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే చికెన్​ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

చికెన్​ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • బ్రాయిలర్ చికెన్- కేజీ
  • నూనె- అర కేజీ
  • పసుపు-టీస్పూన్
  • మెంతి పొడి- టేబుల్​స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 5 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు- 50 గ్రాములు
  • నిమ్మరసం - 3 టేబుల్​స్పూన్లు
  • కారం - 50 గ్రాములు

ఆంధ్రా స్టైల్​ చికెన్​ పచ్చడి తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత నాన్​స్టిక్​ పాన్​లో చికెన్ వేసి అర టేబుల్​స్పూన్​ ఉప్పు, టీస్పూన్​ పసుపు వేసి సన్నని మంట మీద.. చికెన్​ ముక్కల్లో ఉన్న తడి పూర్తిగా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోండి.
  • ఇప్పుడు మందపాటి కడాయిలో అర కేజీ ఆయిల్​ హీట్​ చేసి.. కుక్​ చేసి పక్కన పెట్టుకున్న చికెన్​ని వేసి బాగా డీప్​ ఫ్రై చేసుకోండి. చికెన్​ క్రిస్పీగా ఫ్రై కావాలి.
  • తర్వాత చికెన్​ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు అదే ఆయిల్​లో అర కప్పు (దాదాపు 60 గ్రాములు) ఫ్రెష్​గా గ్రైండ్​ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకోండి.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్​ ముక్కలను వేసి రెండు నిమిషాల తర్వాత, మెంతి పొడి వేసుకుని కలుపుకోండి.
  • ఈ ప్రాసెస్​లో మీకు నచ్చితే.. టేబుల్​స్పూన్​ గరం మసాలా కూడా యాడ్​ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు 50 గ్రాముల ఉప్పు వేసుకుని బాగా కలపండి. 50 గ్రాముల కారం కలుపుకుని స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఈ చికెన్​ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండి.. ఎయిర్​టైట్​ సీసాలో స్టోర్​ చేసుకోండి.
  • చాలా సింపుల్​గా ఇలా చికెన్​ పచ్చడిని ప్రిపేర్​ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి సూపర్​ టేస్టీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

రెస్టారెంట్​ స్టైల్​ అపోలో చికెన్​ రెసిపీ - ఈ వర్షాకాలంలో రుచి చూడాల్సిందే గురూ!

ఓ వైపు వర్షం.. మరోవైపు సండే : "అద్దిరిపోయే నాటుకోడి పులుసు" ఇలా ప్రిపేర్ చేయండి! - యమ్మీ యమ్మీగా జుర్రుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.