How to Book Confirm Tatkal Ticket : సమయం ఆదా, తక్కువ ఖర్చు వంటి కారణాలతో రైలు ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. సుదూర ప్రాంతాలకు ట్రైన్ జర్నీ ప్లాన్ చేసేవారు ముందస్తుగా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేస్కుంటారు. కానీ.. కొన్నిసార్లు ఉన్నట్టుండి జర్నీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారంతా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు చూస్తారు.
వీరికోసం ఐఆర్సీటీసీలో(IRCTC) తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఐఆర్సీటీసీ అందిస్తున్న తత్కాల్ టికెట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ప్రయాణం చేయడానికి ఒక రోజు ముందు మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఏసీ క్లాస్‌లకు సంబంధించిన టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే.. నాన్ ఏసీ క్లాస్‌లకు చెందిన టికెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
అంత ఈజీకాదు..
కానీ.. తత్కాల్ టికెట్లు పొందడం అంత సులభమైన పనికాదు. ఎందుకంటే.. ఆ టైమ్‌లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. తత్కాల్ టికెట్ విండో కొంత సమయం మాత్రమే ఓపెన్‌లో ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఒకేసారి బుకింగ్‌కి ప్రయత్నించడం వల్ల ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి.. మీరు తత్కాల్ బుకింగ్ టైమ్‌లో వేగంగా, చురుకుగా స్పందించాల్సి ఉంటుంది. అయితే.. ఆ టైమ్‌లో ఇలా బుక్ చేసుకున్నారంటే ఈజీగా తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
విహార యాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - Summer Special Trains
తత్కాల్ టికెట్ ఎలా కన్ఫామ్ చేసుకోవాలి?
- IRCTCలో మీరు తత్కాల్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ముందుగా IRCTC అకౌంట్‌ను కలిగి ఉండాలి.
- లేదంటే IRCTC వెబ్‌సైట్, యాప్‌ను సందర్శించి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఓపెన్ అయిన పేజీలో 'My Account' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు మాస్టర్ జాబితా అనే ఆప్షన్‌ను ఎంచుకొని అక్కడ అవసరమైన డేటాను ఎంటర్ చేయాలి.
- ఆ విధంగా మీరు ప్రయాణీకుల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత.. ఆ సమాచారం కరెక్టా కాదా? అని మళ్లీ కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత మీరు తత్కాల్ టికెట్ విండో ఓపెన్ చేసి మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను అందించాలి.
- దీని తర్వాత మాస్టర్ జాబితాలో మీరు అంతకుముందు నమోదు చేసిన సమాచారం కనిపిస్తుంది.
- ఇలా సమాచారం మొత్తం ముందే సిద్ధం చేసి, సేవ్ చేసుకోవడం ద్వారా.. మీకు టికెట్ అవసరమైనప్పుడు.. మళ్లీ మొదట్నుంచి డీటెయిల్స్ ఇవ్వాల్సిన పనిలేదు. దాంతో మీకు సమయం ఆదా అవుతుంది.
- ఇప్పుడు మీరు పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. వెంటనే మీ తత్కాల్ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.