ETV Bharat / bharat

హిమాచల్​లో ఆపరేషన్ కమలం- సుఖు సర్కార్​పై అవిశ్వాస తీర్మానం? రంగంలోకి డీకే, హుడా

Himachal Pradesh Politics : హిమాచల్​ ప్రదేశ్​లో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో క్రాస్ ఓటింగ్​కు పాల్పడ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధమైంది.

Himachal Pradesh Politics
Himachal Pradesh Politics
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 7:38 AM IST

Himachal Pradesh Politics : రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాషాయదళం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చలు జరిపేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతోపాటు డీకే శివకుమార్​ను పరిశీలకులుగా నియమించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు వారిద్దరూ బుధవారం ఉదయం శిమ్లా చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

హరియాణాకు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు
అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ (క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ) ఎమ్మెల్యేలు శిమ్లా నుంచి హరియాణాకు వెళ్లారు. వారంతా బీజేపీతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. హరియాణాలోని పంచకులాలోని గెస్ట్‌హౌస్‌ బయట ఓ కాన్వాయ్‌ ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుధీర్‌ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.

గవర్నర్​ను కలిశాక!
అసెంబ్లీ సమావేశాలకు ముందు బుధవారం ఉదయం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని పేర్కొంటూ జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలుస్తారని తెలుస్తోంది. అనంతరం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లాటరీలో బీజేపీకే జై
హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సునాయాసమని అంతా అనుకున్నారు. కానీ భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీకి 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడం వల్ల నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో బీజేపీకి చెందిన హర్ష్‌ మహాజన్‌ను అదృష్టం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఓడిపోయారు.

'ఎమ్మెల్యేలు కిడ్నాప్​!'
రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు హరియాణా పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ గూండాయిజానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్‌ పదే పదే కౌంటింగ్‌ హాలులోకి వచ్చి అధికారులను బెదిరించారని ఆరోపించారు.

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​- 10 సీట్లలో బీజేపీ విజయభేరి, 3స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్- హిమాచల్​లో బీజేపీ అభ్యర్థి గెలుపు- టాస్​తో వరించిన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.