ETV Bharat / bharat

టీచర్​కు​ రూ.8వేలు, వాచ్​మెన్​కు రూ.10వేలు జీతం- ప్రభుత్వ పాఠశాల ఉద్యోగ ప్రకటన ఇలా! - HIMACHAL TEACHER JOB NOTIFICATION

ప్రభుత్వ పాఠశాల పార్ట్​టైమ్​ టీచర్​, వాచ్​మెన్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ - టీచర్​కు రూ.8 వేలు, వాచ్​మెన్​కు రూ,10 వేలు జీతం​!

Himachal Teacher Job Notification
Himachal Teacher Job Notification (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 4:46 PM IST

Himachal Teacher Job Notification : హిమాచల్​ప్రదేశ్​లోని ఓ గవర్నమెంట్ హైస్కూల్ ఇచ్చిన టీచర్ జాబ్​ నోటిఫికేషన్ ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. అందులో టీచర్​ కంటే వాచ్​మెన్​ ఉద్యోగానికే ఎక్కువ జీతం ఉంది. దీంతో అంతా ఓ నోటిఫికేషన్​ కోసమే మాట్లాడుకుంటున్నారు! అసలు విషయమేమింటంటే?

పార్ట్​ టైమ్​ టీచర్​, వాచ్​మెన్ ఉద్యోగాల​ కోసం​ చంబా జిల్లాలోని భర్​మోర్​ హైస్కూల్ నోటిఫికేషన్​ను​ విడుదల చేసింది. ఆ ప్రకటనలో పార్ట్​టైమ్​ ఉపాధ్యాయుడికి విద్యార్హత బీఎస్సీ/ఎమ్​స్సీ బీఈడీ, టెట్​, అదే వాచ్​మెన్​కు పదోతరగతిగా పేర్కొంది. అయితే వాచ్​మెన్​ కంటే టీచర్​కు ఇచ్చే​ జీతమే తక్కువగా ఉంది. పార్ట్​టైమ్​ టీచరుకు రూ.8,450 కాగా, వాచ్​మెన్ రూ.10,630గా ఉంది. రెండు పోస్టులకు అక్టోబరు 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది.

అయితే రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ రిక్రూట్​మెంట్ ప్రకటనను​ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్​ మీడియాలో పాఠశాల యాజమాన్యాన్ని విమర్శిస్తున్నారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు టీచర్​ కంటే వాచ్​మెన్​ ఉద్యోగమే బెస్ట్​ అనుకుంటా అని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు, సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలపై భర్​మోర్​ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు స్పందించారు. పాఠశాల పరిధిలోని కస్తూర్భా గాంధీ హాస్టల్​లో బాలికలకు ఉదయం, సాయంత్రం ఒక గంట చొప్పున బోధించడానికి పార్ట్​టైమ్​గా ఉపాధ్యాయుడిని నియమించేందుకు నోటిఫికేషన్​ ఇచ్చామని అన్నారు. అదే వాచ్​మెన్​కు ఫుల్​టైమ్​ డ్యూటీ ఉంటుందని, అదే విషయాన్ని ప్రకటనలో స్పష్టంగా వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.