ETV Bharat / bharat

రైలు పట్టాలపై హై వోల్టేజ్​ ​వైర్​- యశ్వంత్​పుర్ ఎక్స్​ప్రెస్​లో వేల మంది- లోకోపైలట్​ లక్కీగా! - High Voltage Wire On Train Track - HIGH VOLTAGE WIRE ON TRAIN TRACK

High Voltage Wire On Train Track : లోకోపైలట్​ సమయస్ఫూర్తితో వ్యవహరించి వేల మంది ప్రాణాలను కాపాడాడు. రైలు పట్టాలపై హై వోల్టేజ్ విద్యుత్​ తీగను గమనించి అత్యవసరంగా రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

High Voltage Wire On Train Track
High Voltage Wire On Train Track
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 9:15 PM IST

Updated : Mar 30, 2024, 10:00 PM IST

High Voltage Wire On Train Track : రైల్వే ట్రాక్​పై హై వోల్టేజ్ వైర్​ను​ గమనించిన లోకోపైలట్​ రైలును అత్యవసరంగా నిలిపివేశాడు. లోకోపైలట్​ అప్రమత్తతతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్ పట్టణ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
వేల మంది ప్రయాణికులతో యశ్వంత్​పుర్​ ఎక్స్​ప్రెస్​ హాసన్​కు శుక్రవారం ఉదయం బయలుదేరింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో కుణిగల్ పట్టణ సమీపంలో రైల్వే ట్రాక్​పై హై వోల్టేజ్​ విద్యుత్​ లైన్​ పడి ఉంది. దాన్ని గమనించిన లోకోపైలట్ రైలును అత్యవసరంగా నిలిపివేశాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్​ సమయస్ఫూర్తిని ప్రయాణికులు అభినందించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు లోకోపైలట్. ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన రైల్వే టెక్నికల్ సిబ్బంది విద్యుత్​ తీగను తీసేశారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో రైలు హాసన్ వైపు బయలుదేరిందని రైల్వే వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్ర నాందేడ్​లో పుర్ణ-పర్లి ప్యాసింజర్​ రైలులో గతేడాది డిసెంబర్​లో మంటలు చెలరేగాయి. మెయింటెనెన్స్​ యార్డ్​లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్​లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నాందేడ్​లోని హూజుర్​ సాహెబ్ రైల్వే స్టేషన్​ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్​ యార్డ్​లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైల్వే శాఖతో పాటు స్థానిక మున్సిపల్​ కార్పొరేషన్​కు సంబంధించిన అగ్రిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న లగేజీ వ్యాన్​ కోచ్​లో మంటలు చెలరేగగా, 30 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్క బోగీ మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. మంటలు వ్యాపించకుండా బోగిని మరో ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.

పేద విద్యార్థికి ఐటీ షాక్- రూ.46కోట్లకు పన్ను కట్టాలని నోటీసులు- చివరకు! - Income Tax Notice To Poor Student

"ర్యాట్​ గ్లూ"పై అలుపెరగని యుద్ధం - అమెజాన్ To ఫ్లిప్‌కార్ట్ అన్నీ తొలగించాయి! - ఎందుకో తెలుసా? - BAN ON RAT GLUE PADS

Last Updated : Mar 30, 2024, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.