ETV Bharat / bharat

ఈ స్మార్ట్​వాచ్​తో ఫుల్​ బాడీ రిపోర్ట్!- డాక్టర్​కు, ఫ్యామిలీకి మెసేజ్​- ధర తక్కువే! - health monitoring watch for seniors - HEALTH MONITORING WATCH FOR SENIORS

IIIT Student Made Health Monitor Smartwatch : ధరించిన వ్యక్తి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని అతడి కుటుంబసభ్యులు, వైద్యులకు తెలిసేలా ఓ స్మార్ట్​ వాచ్​ను తయారు చేశాడు విద్యార్థి. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​కు చెందిన ట్రిపుల్​ ఐటీ విద్యార్థి అతి తక్కువ ధరలో దీనిని రూపొందించాడు.

IIIT Student Made Health Monitor Smartwatch

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 7:37 PM IST

Updated : Apr 14, 2024, 7:47 PM IST

IIIT Student Made Health Monitor Smartwatch : ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​కు చెందిన ట్రిపుల్​ ఐటీ విద్యార్థి పంకజ్​ కుమార్​ సరికొత్త స్మార్ట్​వాచ్​ను రూపొందించాడు. ధరించిన వ్యక్తి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని అతడి కుటుంబసభ్యులు, వైద్యులకు తెలిసేలా ఓ వాచ్​ను తయారు చేశాడు. ఈ వాచ్​ను రూపొందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50లక్షల గ్రాంటును సైతం పొందాడు. ఈ వాచ్​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న స్మార్ట్​ వాచ్​ల కంటే తక్కువ ధర ఉంటుందని పంకజ్​ చెబుతున్నాడు. ఈ వాచ్​లో ఆపద సమయాల్లో కుటుంబసభ్యులకు అలర్ట్​ మెసేజ్​లు, లోకేషన్​ను పంపించే సదుపాయాన్ని కల్పించాడు.

ప్రయాగ్​రాజ్​కు చెందిన పంకజ్​ కుమార్​ ట్రిపుల్​ ఐటీలో ఎంటెక్​ చేస్తున్నాడు. ఒకవైపు చదువుతూనే, మరోవైపు వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలానే ఉద్దేశంతో ఓ స్మార్ట్ వాచ్​ను రూపొందించాడు. దీంతో పాటు ఏదైనా విపత్కర సమయంలో అనారోగ్యానికి గురైనా వెంటనే సమాచారాన్ని వైద్యులు, కుటుంబసభ్యుల మొబైల్​కు చేరవేస్తుంది. ప్రస్తుతం తయారీ చేసిన ఈ నమూనాను పరీక్షిస్తున్నారు. ఇది 2025నాటికి మార్కెట్​లో లాంఛ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ వాచ్​కు మరిన్ని తుదిమెరుగులు దిద్దుతున్నట్లు పంకజ్​ తెలిపారు.

"దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ వాచ్​ను తయారు చేశాను. ఈ స్మార్ట్​ వాచ్​ను లాంఛ్​ చేసిన తర్వాత, మరిన్ని ప్రాజెక్ట్​లపై పనిచేస్తాను. ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ధరతో స్మార్ట్ వాచ్​ తయారీపై దృష్టి పెట్టాను. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ స్మార్ట్​ వాచ్​ ఇతరవాటికన్నా తక్కువ ధరలో లభ్యమవుతుంది."

--పంకజ్​ కుమార్​, ట్రిపుల్​ ఐటీ విద్యార్థి

ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్- రక్తంతో పని లేదు!
మన శరీరంలో మధుమేహం స్థాయిని తెలుసుకోవాలంటే కచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే. కానీ హిమాచల్​ప్రదేశ్​లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు రక్తం తీయకుండానే షుగర్​ పరీక్ష చేసేలా ఓ కొత్త పరికరాన్ని ఇటీవలె తయారు చేశారు. అదెలా పని చేస్తుందో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Apr 14, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.