ETV Bharat / bharat

'భోలే బాబాను తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర'- 'సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే బాధ్యత వహించాలి' - Hathras Stampede Case Updates - HATHRAS STAMPEDE CASE UPDATES

Hathras Stampede Case Updates : హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు కారకులైన భోలే బాబాపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, సత్సంగ్ నిర్వహించిన భోలే బాబాయే హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు.

Bhole Baba Connection with Hathras Stampede
Hathras Stampede Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 10:56 AM IST

Updated : Jul 7, 2024, 11:41 AM IST

Hathras Stampede Case Updates : ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబాకు రాజస్థాన్​లోని అల్వార్​లో ఓ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. వారిలో కొందరు భోలే బాబా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. భోలే బాబా వల్లే తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పుకొచ్చారు ఒక మహిళ. హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు భోలే బాబాకు సంబంధం లేదని మరొకరు అన్నారు. ఓవైపు భోలే బాబాపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు భక్తులు ఆయనపై సానుకూల ధోరణిని కలిగి ఉన్నారు.

అల్వార్​లోని ఖేర్లీ గ్రామానికి సమీపంలోని సహజ్​పుర్​లో భోలే బాబా ఆశ్రమం ఉంది. ఇక్కడకి భోలే బాబా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కొవిడ్ మహమ్మారి సమయంలో బాబా ఇక్కడే ఉండేవారని ఆశ్రమ సేవకులు చెప్పారు. కాగా, భోలే బాబా హాథ్రస్​లో నిర్వహించిన సత్సంగ్​లో సహజ్​పుర్​కు చెందిన కొందరు భక్తులు హాజరయ్యారు. వారు హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై పలు విషయాలను పంచుకున్నారు. సత్సంగ్ ముగియగానే భోలే బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారని సహజ్​పుర్​కు చెందిన ప్రత్యక్ష సాక్షి లఖో దేవి తెలిపారు. ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పారు. సత్సంగ్​కు భారీగా భక్తులు హాజరవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని, వేడి కారణంగా చాలా మంది చనిపోయారని పేర్కొన్నారు.

'సత్సంగ్ పొలంలో జరిగింది. పొలంలో నుంచి రోడ్డు ఎక్కేందుకు భక్తులు ప్రయత్నించారు. అయితే రోడ్డు, పొలం కన్నా చాలా ఎత్తులో ఉంది. పొలాల్లో బంకమట్టి ఉండడం వల్ల తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేను బురదలో కూరుకుపోయేదాన్ని. కానీ నా కుమార్తె నన్ను రక్షించింది. భోలే బాబాను హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు' అని లఖో దేవి ఆరోపించారు.

'భోలే బాబా నా గాయాన్ని నయం చేశారు'
తన తలకు కొన్నాళ్ల క్రితం గాయమైందని భోలే భక్తురాలు సునీత చెప్పారు. భరత్​పుర్, మధురలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా అది తగ్గలేదని చెప్పుకొచ్చారు. భోలే బాబా ప్రసంగం విన్న తర్వాత తల గాయం నుంచి ఉపశమనం పొందానని తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని అన్నారు. హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా, 2005 నుంచి తనకు భోలే బాబాతో అనుబంధం ఉందని ఖేర్లీ నివాసి మంగతురామ్ తెలిపారు. ఆయన మంచి మాటలు నచ్చి అనుచరుడిగా మారానని చెప్పుకొచ్చారు. భోలే బాబా ప్రసంగంలో మానవత్వం ఉంటుందని అన్నారు. భోలే బాబా ప్రసంగం కపటత్వానికి దూరంగా ఉంటుందని పేర్కొన్నారు.

'ఆ ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి'
హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై తొలిసారి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఆ ఘటనకు సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే బాధ్యత వహించాలని భోలే బాబాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం వ్యక్తం చేశారు. 'హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత భోలే బాబా పరారీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ విషాధ ఘటనతో బాధపడ్డానని చెబుతున్నారు. అదీ చాలా తప్పు. సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలి. అది అతడి బాధ్యత. పోలీసుల ముందుకు వచ్చి తన నేరాన్ని భోలే బాబా అంగీకరించాలి' అని ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు అరెస్ట్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడైన దేవ్​ప్రకాశ్‌ మధుకర్​ను (42) శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో అతడిని ఉత్తర్​ప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిందితుడిని కొంత మంది రాజకీయ నాయకులు సంప్రదించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నిందితులు రాంప్రకాశ్‌ శాక్య (61), సంజు యాదవ్​లనూ (33) పోలీసులు అరెస్టు చేశారు.

పూరీ జగన్నాథుని రథయాత్రకు అంతా రెడీ- 1971 తర్వాత తొలిసారి ఇలా!

జమ్ము కశ్మీర్​లో భారీ ఎన్​కౌంటర్​ - నలుగురు ఉగ్రవాదులు హతం

Last Updated : Jul 7, 2024, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.