ETV Bharat / bharat

హరియాణా ఎన్నికల అభ్యర్థుల్లో 52% మంది కోటీశ్వరులు - 133 మందిపై క్రిమినల్​ కేసులు - Haryana Assembly Election 2024 - HARYANA ASSEMBLY ELECTION 2024

ADR Report On Haryana Assembly Elections : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా కోటీశ్వరులే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 13 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

ADR Report On Haryana Assembly Elections
ADR Report On Haryana Assembly Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 10:47 AM IST

ADR Report On Haryana Assembly Elections : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. అక్టోబర్‌ 5న పోలింగ్ జరగనుండడం వల్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారు. మొత్తం 90 స్థానాలు కలిగిన హరియణా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో దాదాపు సగానికి పైగా అభ్యర్థులు కోటీశ్వరులున్నారు. ఎన్నికల వేళ నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో 1028 మంది అభ్యర్థుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడీఆర్) విశ్లేషించింది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 538 మంది (52%) కోటీశ్వరులేనని వెల్లడించింది.

అత్యంత సంపన్నులు వీరే
కోటీశ్వరులైన అభ్యర్థుల జాబితాలో 184 మంది స్వతంత్రులు ఉన్నారు. బీజేపీ నుంచి 85 మంది, కాంగ్రెస్‌ 84, జేజేపీ 46, ఐఎన్​ఎల్​డీ 34, ఆప్‌ 52, బీఎస్​పీ 18 మంది చొప్పున పోటీలో ఉన్నట్లు నివేదికలో తెలిపింది. హిసార్‌లోని నార్నౌండ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెప్టెన్‌ అభిమన్యు అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అత్యధికంగా రూ.491 కోట్లుగా నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. సోహ్నా నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్‌ అభ్యర్థి రోహ్తస్‌ సింగ్‌ ఆస్తుల విలువ రూ. 484 కోట్లు కాగా, హిసార్‌ నుంచి బరిలో నిలిచిన సావిత్రి జిందాల్‌ ఆస్తి విలువ రూ. 270 కోట్లకు పైనే ఉంది.

ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రూ.5 కోట్లు పైబడిన ఆస్తులు కలిగిన అభ్యర్థులు 277 మంది (27శాతం) ఉన్నారు. రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు మధ్య ఉన్నవారు 136 మంది (13%), రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల ఆస్తి కలిగిన అభ్యర్థులు 22శాతం మంది ఉన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఆస్తి ఉన్నవారు 19 శాతం, రూ.10 లక్షల కన్నా తక్కువ కలిగినవారు 19 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1138 మంది అభ్యర్థుల్లో 481 మంది 42 శాతం మంది కోటీశ్వరులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 52 శాతానికి పెరగడం విశేషం.

13 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
హరియాణా శాసనసభ ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో 133 మంది(13శాతం) పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరో 95 మంది (9శాతం)పై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 209 మంది గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేయగా, 152 మంది పీజీ, 15 మంది డాక్టరేట్‌, 201 మంది పదో తరగతి పాసయ్యారు. 15 మంది నిరక్షరాస్యులు సైతం పోటీలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 928 మంది పురుషులు ఉండగా, 100 మంది మాత్రమే మహిళలు బరిలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.