Haryana Assembly Election 2024 : హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 90అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. హరియాణా సీఎం సైనీలాడ్వా నుంచి పోటీచేస్తుండగా ప్రతిపక్ష నేత భూపిందర్‌సింగ్ హుడా-గర్హి సంప్లాకిలోయి స్థానం నుంచి బరిలో ఉన్నారు.
ఎల్లెనాబాద్ నుంచి INLD అధినేత అభయ్‌సింగ్ చౌతాలా, ఉచనా కలాన్‌లో జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా, జులానాలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్ పోటీ చేస్తున్నారు. రెండు కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, వారి కోసం 20629 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఒకేవిడతలో పోలింగ్ జరగనుండగా ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలు, కాంగ్రెస్ 31 సీట్లు గెలుపొందాయి. అయితే జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీక దాదాపు స్వతంత్రులందరూ మద్దతు తెలిపారు.
#WATCH Sirsa | Polling parties left for polling stations with EVMs for Haryana Assembly Elections 2024.
— ANI (@ANI) October 4, 2024
Tomorrow, on October 5, voting will be held for all 90 assembly seats of Haryana. pic.twitter.com/6loGM2urzQ
#WATCH | Ambala | Polling parties were sent to polling stations with EVMs for Haryana Assembly Elections 2024.
— ANI (@ANI) October 4, 2024
Tomorrow, on October 5, voting will be held for all 90 assembly seats of Haryana. pic.twitter.com/dzReFccdaF
- హరియాణా శాసనసభ ఎన్నికలు- ముఖ్యాంశాలు:
- నియోజకవర్గాలు- 90
- పోటీలో నిలిచిన అభ్యర్థులు- 1031
- మహిళా అభ్యర్థులు- 101
- స్వతంత్ర అభ్యర్థులు- 464
- ఓటర్ల సంఖ్య-2,03,54,350 (పురుషులు- 1,07,75,957, మహిళలు- 95,77,926, ట్రాన్స్జెండర్లు-467)
- పోలింగ్ కేంద్రాల సంఖ్య- 20,632
- ఈవీఎంల సంఖ్య- 27,866
- భద్రతా సిబ్బంది- 30 వేల మందికిపైగా పోలీసులు, 225 పారామిలటరీ కంపెనీలు
- ప్రధాన పార్టీలు/కూటములు- బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి
- పోటీలో ప్రముఖులు : ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ (లాడ్వా), ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా (గఢీ సాంప్లా-కిలోయ్), అభయ్ చౌతాలా (ఎల్లెనాబాద్), దుష్యంత్ చౌతాలా (ఉచానా కలాన్), అనిల్ విజ్ (అంబాలా కంటోన్మెంట్), వినేశ్ ఫోగట్ (జులానా)
- 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం- 68
- 2019 ఎన్నికల ఫలితాలు- బీజేపీ(40), కాంగ్రెస్(31), జేజేపీ(10)