ETV Bharat / bharat

ఈసీతో గూగుల్‌ జట్టు- ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌! - Google Ties up with ECI

Google Ties up with ECI : కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ జట్టు కట్టింది. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా కొన్ని నిబంధనలను రూపొందించింది.

Google Ties up with ECI
Google Ties up with ECI
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 5:24 PM IST

Updated : Mar 12, 2024, 5:37 PM IST

Google Ties up with ECI : దేశంలో మరికొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడమే కాకుండా ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది.

ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడం కోసం ఈసీతో జట్టు కట్టినట్లు గూగుల్‌ పేర్కొంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుందని తెలిపింది. ఏఐని వినియోగించి రూపొందించే కంటెంట్‌ను గుర్తించడం సులభతరం చేసినట్లు గూగుల్‌ చెప్పింది. డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ చేసిన మీడియాను కట్టడి చేసినట్లు వెల్లడించింది. యూట్యూబ్‌లోని ఏఐ ఫీచర్లతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌కు ఇప్పటికే లేబుల్‌ వేయడం ప్రారంభించామని వివరించింది.

మరోవైపు గూగుల్‌కు చెందిన ఏఐ జెమినిపై విమర్శల నేపథ్యంలో ఆ సంస్థ మరో నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గూగుల్‌ ఆంక్షలు విధించింది. యూట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌లో ఎన్నికలకు సంబంధించిన వార్తలు, సమాచారం కూడా అధీకృత వేదికల నుంచే డిస్‌ప్లే అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే తప్పుడు సమాచారం, హింసను ప్రేరేపించే, విద్వేష వ్యాఖ్యల విషయంలో విధానాలు రూపొందించినట్లు తెలిపింది. పాలసీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు గానూ మనుషులతో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ను కూడా వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల మీదా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది.

త్వరలోనే నోటిఫికేషన్​
త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్​ను విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. 2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ, ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

Last Updated : Mar 12, 2024, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.