ETV Bharat / bharat

సార్వత్రిక ఎన్నికల సమరం షురూ - తొలి దశ నోటిఫికేషన్ విడుదల - lok sabha election 2024

General Election First Phase Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.

General Election First Phase Notification

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 9:04 AM IST

Updated : Mar 20, 2024, 9:38 AM IST

General Election First Phase Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఫలితంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 27 కాగా, 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 30న వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్‌ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోంలో ఐదేసి స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. బిహార్‌లో 4, బంగాల్‌లో 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయాల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్ముక‌శ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

అయితే నామినేషన్ల పరిశీలన మార్చి 28న ఉండగా, బిహార్​లో మాత్రం ఈ నెల 30న ఉంటుంది. అభ్యర్థులు ఏప్రిల్​ 2 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ 18వ లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ఏప్రిల్ 19 జరగనుండగా, ఆ తర్వాత ఆరు దశల్లో ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి. జూన్​ 4న ఓట్లు లెక్కింపు ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్​లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. అరుణాచల్​ప్రదేశ్​, సిక్కింలో కౌంటింగ్​ను జూన్​ 4 నుంచి జూన్​ 2వ తేదీకి మార్చింది.

96.88 కోట్ల మంది ఓటర్లు
దేశంలో మొత్తం 96.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 49.7 కోట్ల మంది ఉండగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారు. 85 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు. 20-29 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓటర్లు 19.74 కోట్ల మంది ఉన్నారు. ఈసారి 18-19 వయసున్న 1.8 కోట్లు యువ ఓటర్లు కొత్తగా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పాలు పంచుకోనున్నారు.

డిపాజిట్‌ దక్కకున్నా తగ్గేదేలే!- ఇప్పటికి 71వేల మంది ఆశలు గల్లంతు

యూపీలో కాంగ్రెస్​కు​ కొత్త ఆశలు! BSP ఒంటరి పోరు వరమయ్యేనా? BJP దారెటు?

Last Updated : Mar 20, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.