ETV Bharat / bharat

దేశంలో మోగిన ఎన్నికల నగారా- 7విడతల్లో సార్వత్రిక పోరు- పోలింగ్, కౌంటింగ్ తేదీలివే

General Election 2024 Notification Released : దేశంలో 18వ లోక్​ సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది. లోక్​సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించింది.

General Election 2024 Notification Released
General Election 2024 Notification Released
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 3:59 PM IST

Updated : Mar 16, 2024, 4:26 PM IST

General Election 2024 Notification Released : దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. జూన్‌ ఒకటిన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

  • తొలి దశ
  • నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
  • నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
  • పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19
  • స్థానాలు - 102
  • రెండో విడత
  • నోటిఫికేషన్‌: 28 మార్చి, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 04
  • నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 5వ తేదీ
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 8
  • పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26
  • స్థానాలు - 89
  • మూడో దశ
  • నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 12, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19
  • నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 20
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 22
  • పోలింగ్‌ తేదీ: మే 7
  • స్థానాలు - 94
  • నాలుగో విడత
  • నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25
  • నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 26
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 29
  • పోలింగ్‌ తేదీ: మే 13
  • స్థానాలు - 96
  • ఐదో విడత
  • నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 26, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
  • నామినేషన్ల పరిశీలన: మే 4
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
  • పోలింగ్‌ తేదీ: మే 20
  • స్థానాలు - 46
  • ఆరో విడత
  • నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 29, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
  • నామినేషన్ల పరిశీలన: మే 7
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
  • పోలింగ్‌ తేదీ: మే 25
  • స్థానాలు - 57
  • ఏడో విడత
  • నోటిఫికేషన్‌: మే 7, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
  • నామినేషన్ల పరిశీలన: మే 15
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 1
  • స్థానాలు - 57

26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
ఒకే విడతలో అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్‌ 19న, ఆంధ్రప్రదేశ్​కు మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి. ఒడిశా శాసనసభ ఎన్నికలను మే 13, 20న రెండుదశల్లో నిర్వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలు భర్తీ చేసేందుకు కూడా షెడ్యూల్​ను విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఆయా చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించనుంది.

ప్రపంచమంతా భారత్ లో జరగబోయే ఎన్నికల వైపు చూస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతీ ఎన్నిక ఒక పరీక్ష లాంటిదేనని, ప్రతీ పరీక్షలోనూ విజయం సాధించాలనేదీ ఈసీ లక్ష్యమని రాజీవ్​ కుమార్ తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. ఇక 2024ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరంగా పిలవొచ్చని అన్నారు. దేశంలో తొలిసారి ఓటు వేయనున్న యువత 1.85 కోట్లని తెలిపారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటువేసే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండేళ్ల నుంచి సార్వత్రిక ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు చెప్పారు.

  • మొత్తం ఓటర్లు 96.8కోట్లు
  • పురుషులు- 49.7 కోట్లు
  • మహిళలు- 47.1 కోట్లు
  • ట్రాన్స్‌జెండర్స్‌-48000
  • 85+ వయసుదాటిన ఓటర్లు - 82లక్షలు
  • 20-29 మధ్య వయసున్న ఓటర్లు -19.74 కోట్లు
  • 18-19 మధ్య వయసున్న ఓటర్లు - 1.8 కోట్లు
  • ఈవీంఎంలు - 55 లక్షలు
  • పోలింగ్ కేంద్రాలు - 10.5 లక్షలు
  • పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది -1.5 లక్షల మంది

2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలకాగా, ఈసారి 6 రోజులు ఆలస్యంగా విడుదల చేసింది. 2019 ఎన్నికలు ఏప్రిల్ 11లో తొలిదశ మొదలుకాగా, మే 19లో చివరి దశ ముగిసింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

బీజేపీ Vs కాంగ్రెస్- ద‌క్షిణాదిపైనే గురి- కమలదళం 'టార్గెట్‌ 370' సాధ్యమయ్యేనా?

కాంగ్రెస్ భవితవ్యం తేల్చే '2024 పోల్స్'- ప్రధాని అభ్యర్థి లేకుండానే బరిలోకి హస్తం పార్టీ- బలాలు, బలహీనతలివే!

Last Updated : Mar 16, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.