Friendly Cricket Match Of MPs : టీబీపై అవగాహన కల్పించేందుకు పార్లమెంటేరియన్ల మధ్య జరిగిన ఫ్రైండ్లీ మ్యాచ్ లో రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ టీమ్‌పై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మంత్రి అనుఠాగ్ ఠాకూర్ కెప్టెన్‌గా ఉండగా, రాజ్యసభ జట్టుకు కిరణ్ రిజిజు కెప్టెన్‌గా వ్యవహరించారు. దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫ్రైండ్లీ మ్యాచ్‌లో రాజ్యసభ టీమ్‌పై లోక్‌సభ జట్టు విజయం సాధించింది.
స్పీకర్ బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో 'సూపర్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దక్కించుకున్నారు. 'సూపర్ సిక్స్' అవార్డు బీజేపీ ఎంపీ సుధాకర్‌కు లభించింది. ఈ మ్యాచ్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం బ్యాటింగ్ చేశారు. చక్కనైన షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ ఫ్రైండ్లీ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ సహా పలువురు విపక్ష ఎంపీలు సైతం ఆడారు.
#WATCH | Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs in the friendly cricket match of Parliamentarians to raise awareness about TB.
— ANI (@ANI) December 15, 2024
Lok Sabha Speaker XI beat Rajya Sabha Chairman XI by 73 runs. pic.twitter.com/Dvnxcq9lsb
'ప్రధాని మోదీ కలను నెరవేరుస్తాం'
భవిష్యత్తులో ఎంపీల బృందం, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తామని లోక్‌సభ ఎలెవన్ జట్టు కెప్టెన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. టీబీ రహిత దేశాన్ని తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌ను టీబీ రహిత దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్రైండ్లీ మ్యాచ్‌లో ఆడిన ఆడగాళ్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
"2025 నాటికి భారతదేశాన్ని క్షయ రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రధాని మోదీ ఇచ్చారు. 2015 నుంచి నేటి వరకు దేశంలో క్షయ సంబంధిత మరణాలలో 38 శాతం తగ్గుదల కనిపించింది. కొత్త కేసులలో 18 శాతం తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 8 శాతమే ఉంది. భారత్ అత్యధిక జనాభా గల దేశం. టీబీకి చికిత్స ఉంది. ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తుంది. అలాగే రూ.1000 ఆర్థిక సాయం చేస్తుంది. "
-- అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ
'టీబీ ఫ్రీ ఇండియా, ఫిట్ ఇండియానే మా లక్ష్యం'
పార్లమెంట్ ఎంపీలు ఫ్రైండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చారని రాజ్యసభ ఎంపీ, ఆ జట్టు కెప్టెన్ కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఫిట్ నెస్ మంత్ర, క్రీడల ద్వారా ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. టీబీ ఫ్రీ ఇండియా, ఫిట్ ఇండియానే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
#WATCH | Delhi: A friendly cricket match of Parliamentarians - Rajya Sabha Chairman XI vs Lok Sabha Speaker XI is being played today at Major Dhyan Chand National Stadium.
— ANI (@ANI) December 15, 2024
Visuals of the toss. pic.twitter.com/yHTHX9Bh7j
ప్రియాంక వ్యాఖ్యలకు కౌంటర్
అలాగే ప్రధాని మోదీపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై సైతం కిరణ్ రిజిజు కౌంటర్ వేశారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీ వీర్ సావర్కర్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. కానీ వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెచ్చుకున్నారని అన్నారు.
'ఆ నిర్ణయం ప్రశంసనీయం'
మంచి లక్ష్యం కోసం పార్లమెంటేరియన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ప్రశంసనీయమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా టీబీపై అవగాహన దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకుల మధ్య శత్రుత్వం తగ్గుందని అన్నారు. క్షయ రహిత భారత్ కోసం ఎంపీలు చేస్తున్న కృషి ప్రత్యేకమైనదని కొనియాడారు.
VIDEO | “Some people are not serious. They feel tired. Parliament stopped functioning as soon as some people stepped inside. So what kind of omen is this for the arrival of some people?,” says BJP MP Anurag Thakur (@ianuragthakur) on Congress MP Priyanka Gandhi’s remark on PM… pic.twitter.com/c7tEogSpzT
— Press Trust of India (@PTI_News) December 15, 2024
'క్షయను ఓడించి దేశాన్ని గెలిపించాలి'
క్షయ వ్యాధిపై అవగాహనకు ఈ మ్యాచ్ నిర్వహించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. కొంచెం అవగాహనతో రోగులు క్షయను ఓడించవచ్చని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదని, క్షయను ఓడించి దేశాన్ని గెలిపించాలని కోరారు.
'గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినవారికి అభినందనలు '
పార్లమెంటేరియన్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంపీలు పాల్గొనడం సంతోషంగా ఉందని తెదేపా నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించినవారికి అభినందనలు తెలియజేశారు. 2025 నాటికి టీబీని ఓడించాలని ప్రధాని చాలా నిబద్ధతతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు టీబీ గురించి మరింత అవగాహన కల్పించడానికి, టీబీ వ్యతిరేక పోరాటంలో వారిని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించామని పేర్కొన్నారు.
'అప్పుడే ప్రధాని మోదీ కలను నెరవేర్చగలుగుతాం'
రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్, లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన గేమ్ చరిత్రాత్మక మ్యాచ్‌గా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ రవికిషన్ తెలిపారు. "యువతను మేల్కొల్పాలి. వారిని మాదకద్రవ్యాలు, టీబీ నుంచి విముక్తి చేయాలి. టీబీ గురించి యువతకు అవగాహన కల్పించాలి. అప్పుడే మనం ప్రధాని మోదీ కలలను నెరవేర్చగలుగుతాం" అని అన్నారు.
#WATCH | On the friendly cricket match of Parliamentarians - Rajya Sabha Chairman XI vs Lok Sabha Speaker XI, BJP MP Ravi Kishan says, " this will be a historic match. the youth has to be awoken, they have to be freed of drugs andtb...we will be able to fulfill the dreams of pm… pic.twitter.com/gRY52YT7eK
— ANI (@ANI) December 15, 2024
'చాలా ఆనందంగా ఉంది'
ఎంపీలందరూ ఫ్రైండ్లీ మ్యాచ్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా భారత్ టీబీ రహిత దేశంగా మారాలని అన్నారు.