Firing outside Salman Khan Home : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning.
— ANI (@ANI) April 14, 2024
Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J
గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు పలు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్పుడు ముంబయి పోలీసులు విచారణ చేపట్టగా, అందులో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పేర్లు బయటకి వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఓ విషయం బయటపడింది. ఈ గ్యాంగ్ టార్గెట్ చేసిన వాళ్ల లిస్ట్‌లో సల్మాన్ పేరు ఉన్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే విషయంపై సల్మాన్‌కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
2023 ఏప్రిల్‌లోనూ సల్మాన్ ఖాన్‌కు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భారీ భద్రతను కల్పించింది. 'ఎక్స్' గ్రేడ్ ఉన్న సెక్యూరిటీని కాస్త 'Y+'గా అప్‌గ్రేడ్ చేసింది. అంతే కాకుండా ఆయన కోసం ఇద్దరు సాయుధ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. ఆ ఇద్దరూ అనునిత్యం సల్మాన్ వెంట ఉండాలని ఆదేశించింది. అంతే కాకుండా బాంద్రా శివారులోని సల్మాన్ నివాసంతో పాటు ఆయన ఆఫీస్ వద్ద బయట భారీ ఎత్తున అభిమానులను గుమిగూడే అనుమతి లేదంటూ అధికారులు వెల్లడించారు. అలా సల్మాన్‌కు రక్షణ కల్పిస్తున్నారు.
సల్మాన్ పేరుతో మోసం - వారికి హీరో టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
'వారిని ప్రమాదంలోకి నెట్టకుండా హాయిగా సినిమాను చూద్దాం'- క్రాకర్స్ ప్రమాదంపై సల్మాన్