ETV Bharat / bharat

ఫాదర్స్ డే : మీ తండ్రికి గిఫ్ట్స్​ ఇచ్చే బదులు ఈ టెస్టులు చేపిస్తే - హ్యాపీ అండ్​ హెల్దీ! - Fathers Day 2024 - FATHERS DAY 2024

Fathers Day 2024 : నేడే(జూన్ 16) ఫాదర్స్ డే. చాలా మంది తమ తండ్రుల త్యాగాలు గుర్తిస్తూ స్టేటస్​లు పెడుతుంటారు. మరికొందరు ఏదైనా బహుమతినిచ్చి ప్రేమను చాటుకుంటారు. అయితే, ప్రతిసారిలా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్​గా ప్లాన్ చేయండి. ఈ హెల్త్ చెకప్స్ చేయించి ఫాదర్స్ డే స్పెషల్ గిఫ్ట్​గా ఆరోగ్యాన్ని అందిచండి.

Fathers Day 2024 Special Gift
Fathers Day 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 2:24 PM IST

Updated : Jun 16, 2024, 9:10 AM IST

Fathers Day 2024 Special Gift : నాన్న.. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి. తనలోని బాధని మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకుంటూ ఇంటిల్లిపాదిని కాపాడుకునే స్ఫూర్తి ప్రధాత. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి తండ్రి దేవుడే! మనకు జీవితాన్నిచ్చేది అమ్మ అయితే.. జీవన విధానాన్ని నేర్పి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడేలా చేసే ఆది గురువు నాన్న. అందుకోసం తాను ఎన్ని కష్టాలు పడ్డా సరే.. తన బిడ్డలు సంతోషంగా ఉండాలని అహర్నిశలూ శ్రమిస్తారు. అందుకే అలాంటి తండ్రిని గౌరవిస్తూ ఓ పండగ చేసుకుంటారు. అదే.. ఫాదర్స్ డే(Fathers Day 2024).

ఏటా.. జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ ఏడాది(2024) జూన్ 16న వస్తోంది. మరి మీ ప్రియమైన తండ్రి కోసం బహుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అయితే, ప్రతిసారిలా కాకుండా ఈసారి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వైద్య పరీక్షలు చేయించండి. ఈ ఫాదర్స్​ డే రోజున మీ సంతోషాన్ని వారితో ఇలా పంచుకోండి.

హైబీపి : ఫాదర్స్ డే రోజున మీ నాన్న ఆరోగ్యం కోసం ముందుగా బీపీ చెకప్ చేయించండి. ఎందుకంటే.. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎలాంటి లక్షణాలు చూపించకుండానే శరీరం లోపల సమస్యల్ని సృష్టిస్తుంది. అంతేకాదు.. దీనికి ట్రీట్​మెంట్ తీసుకోకుండా వదిలేస్తే స్ట్రోక్స్​కి దారి తీస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. కేవలం నార్మల్​ టెస్ట్​తో​ బీపీ ఉందో లేదో ఈజీగా గుర్తించొచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు, ధూమపానం, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే రెగ్యులర్​గా బీపీ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

డయాబెటిస్ టెస్ట్ : మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. కాబట్టి, దీని బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు తరచుగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి, మీ నాన్న ఆరోగ్యం కోసం ఓసారి డయాబెటిస్ టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నట్లయితే తగిన చికిత్స తీసుకోకపోతే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా.. బ్లడ్ టెస్టులు చేయించండి. ఎందుకంటే.. ఇతర ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న కూడా తెలిసిపోతుంది. దాంతో తగిన ట్రీట్​మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఫాదర్స్ డే రోజు​.. మీ తండ్రికి ఇవ్వాల్సిన '5' స్పెషల్​ 'ఆర్థిక' బహుమతులు ఇవే!

ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్, క్యాన్సర్ టెస్టులు : ఫాదర్స్ డే రోజు మీ తండ్రికి చేయించాల్సిన వాటిలో ఇవి కూడా ఒకటి. ఈ టెస్టులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రాణాలను కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయి. మూత్రవిసర్జన, మూత్రనిలుపుదలతో సమస్యల్ని కలిగించే ఓ నార్మల్ ప్రాబ్లమ్.. ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్. దీనికోసం రెండు రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకటి.. డిజిటల్ మల పరీక్ష. ఇది విస్తారిత, అసాధారణమైన ప్రోస్టేట్‌ని తెలియజేస్తుంది. మరొకటి.. PSA పరీక్ష. ఇది రక్తంలో ప్రొస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్స్‌ని గుర్తిస్తోంది.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష : ఇది కొలెస్ట్రాల్ టెస్ట్, హై కొలెస్ట్రాల్, హైబీపి వంటి సమస్యల గురించి సమాచారం అందిస్తోంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే తెలియజేస్తుంది. బ్లడ్ టెస్ట్ ఆధారంగానే దీన్ని చేస్తారు. అయితే, ఈ టెస్ట్ చేసే ముందు 12 గంటల పాటు ఏం తీసుకోకూడదు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఆరు నెలలకోసారి ఈ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

తండ్రి అయ్యాకే తెలుస్తుంది నాన్న అంటే ఏమిటో..

Last Updated : Jun 16, 2024, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.