ETV Bharat / bharat

సైకిల్​పై 8ఏళ్ల కూతురితో చార్​ధామ్ యాత్ర- ఆ వ్యక్తి కోసమే! - Chardham Yatra On Bicycle - CHARDHAM YATRA ON BICYCLE

Gujarat Devotees Chardham Yatra On Bicycle : నిరాశ్రయులు, అనాథలకు అండగా నిలుస్తున్న ఓ వ్యక్తి కోసం ప్రార్థించేందుకు సైకిల్​పై చార్​ధామ్ యాత్రను గుజరాత్​కు చెందిన తండ్రీకూతుళ్లు చేపట్టారు. 8ఏళ్ల కుమార్తెతో కలిసి బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న ఆ వ్యక్తి, మరికొద్ది రోజుల్లో నేపాల్​లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుడ్ని దర్శించుకోనున్నట్లు చెప్పారు.

Gujarat Devotees Chardham Yatra on bicycle
Gujarat Devotees Chardham Yatra on bicycle (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 10:30 AM IST

Gujarat Devotees Chardham Yatra On Bicycle : అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న ఓ వ్యక్తి కోసం ప్రార్థించడానికి సైకిల్​పై చార్​ధామ్ యాత్రను చేపట్టారు తండ్రీకూతుళ్లు. 8ఏళ్ల కుమార్తెతో కలిసి గుజరాత్ నుంచి చార్​ధామ్ యాత్రను చేపట్టారు అశోక్ జీనా భాయ్. ఇంతకీ ఎనిమిదేళ్ల వయసు ఉన్న కుమార్తెతో కలిసి అశోక్ సైకిల్​పై చాలా దూరంలో యాత్రాస్థలాలను ఎందుకు దర్శించుకుంటున్నారు? ఈ యాత్ర వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనేవి తెలియాలంటే ఈ స్టోరీ చదవేయాల్సిందే.

'ఆయనే కోసమే ప్రార్థిస్తున్నాం'
గుజరాత్​కు చెందిన 8ఏళ్ల కంగర్ కృష్ణ అశోక్ భాయ్ అనే బాలిక తన తండ్రి అశోక్ జీనా భాయ్​తో కలిసి ఇటీవల సైకిల్​పై గుజరాత్ నుంచి ఉత్తరాఖండ్​కు బయలుదేరింది. తాజాగా బద్రీనాథ్​లో దైవ దర్శనాన్ని తండ్రీకూతుళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో "ఈటీవీ భారత్​"తో మాట్లాడి సైకిల్ యాత్ర గురించి పలు విషయాలను పంచుకున్నారు అశోక్ జీనా భాయ్. గుజరాత్​లో పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం ఏదైనా చేయాలని చార్​ధామ్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఈ యాత్రలో నితిన్ జానీ కోసం ప్రార్థిస్తామని చెప్పారు. చార్​ధామ్‌ యాత్ర చేపట్టడానికి తన కుమార్తె కంగర్ కృష్ణ తనను ప్రేరేపించిందని పేర్కొన్నారు. "నితిన్ జానీ చేసిన సేవకు మొదట నా కూతురు కంగర్ కృష్ణ అశోక్ భాయ్ ఆకర్షితురాలైంది. ఈ తర్వాత నితిన్ జానీ గురించి నాతో చెప్పింది. అప్పుడే నితిన్ జానీ గురించి ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో చార్​ధామ్ యాత్రకు బయలుదేరాను" అని అశోక్ జీనా భాయ్ తెలిపారు.

సైకిల్ పై 8ఏళ్ల కూతురితో చార్ ధామ్ యాత్ర- సమాజ సేవ చేస్తున్న వ్యక్తి కోసం ప్రార్థనలు (ETV Bharat)

ఆయన కోసమే ఈ యాత్ర!
గుజరాత్​లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం చార్​ధామ్ యాత్ర చేపట్టినట్లు 8ఏళ్ల కంగర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులకు నితిన్ జానీ సహాయం చేస్తారని పేర్కొన్నారు. అందుకే నితిన్ జానీ కోసం తాను ఏదైనా చేయాలనుకున్నట్లు చెప్పారు. 'అందరికీ సేవ చేసే వ్యక్తికి నేను ఏమి చెయ్యగలను? అందుకే చార్​ధామ్‌ యాత్రకు వెళ్లి నితిన్ జానీ కోసం ప్రార్థించాలని అనుకున్నాను. నేను కూడా భవిష్యత్తులో సమాజానికి సేవ చేస్తాను. నితిన్ జానీ కోసం బద్రీనాథ్ స్వామిని ప్రార్థించాను. ఇప్పటి వరకు ద్వారక, బద్రీనాథ్​ను సందర్శించాం. ఉత్తరాఖండ్​కు రావడం సంతోషంగా ఉంది' అని కంగర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు.

హైస్కూల్ స్టూడెంట్స్​కు రూ.1000- ప్రతి నెలా ఖాతాల్లో జమ- సీఎం స్టాలిన్ ప్రకటన

ఇంటర్​సిటీ​లో మంటలు!- భయంతో రైలు దిగిన ప్రజలు- అప్పుడే గూడ్స్ ఢీకొని అనేక మంది! - train accident today

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.