ETV Bharat / bharat

ఫేక్​ కోర్ట్​ నడుపుతూ భారీ స్కామ్- ఐదేళ్లుగా జడ్జిలా తీర్పులు- చివరకు ఏమైందంటే?

గుజరాత్​లో ఫేక్ కోర్టు- జడ్జిగా నమ్మించి తీర్పులు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake Court in Gujarat
Fake Court in Gujarat (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Fake Court in Gujarat : గుజరాత్​లో నకిలీ కోర్టు గుట్టురట్టు అయ్యింది. నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే?
అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్ట్ రిజిస్ట్రార్- కరంజ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ ప్రభుత్వ భూమికి సంబంధించి 2019లో నమోదైన కేసులో తన క్లయింట్​కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ తర్వాత ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్ పేరును చేర్చాలని కలెక్టర్​ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఉత్తర్వును అమలు చేయాలని కోరుతూ శామ్యూల్, మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేశాడు. అలాగే తాను జారీ చేసిన నకిలీ ఆర్డర్​ను కూడా పిటిషన్​కు జత చేశాడు. దీంతో అసలు విషయం బయటపడగా, సిటీ సివిల్ కోర్ట్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fake Court in Gujarat
నకిలీ కోర్టు ఏర్పాటు చేసిన శామ్యూల్ (ETV Bharat)

మధ్యవర్తిగా నటిస్తూ!
నిందితుడు శామ్యూల్ మధ్యవర్తిగా నటిస్తూ వివాదాస్పద భూములపై ఆదేశాలు జారీ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్. దీంతో పోలీసులు శామ్యూల్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని పోలీసులు తెలిపారు.

Fake Court in Gujarat
గుజరాత్​లో ఏర్పాటు చేసిన నకిలీ కోర్టు (ETV Bharat)

"కనీసం ఐదేళ్లుగా అహ్మదాబాద్​లో శామ్యూల్ నకిలీ కోర్టు నడుస్తోంది. సిటీ సివిల్ కోర్టులో భూ వివాదాల కేసులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తులను నిందితుడు ట్రాప్ చేశాడు. వారి నుంచి కేసుకు కొంత మేర నగదును తీసుకున్నాడు. శామ్యూల్ మొదట తనను తాను కోర్టు నియమించిన అధికారిక మధ్యవర్తిగా పరిచయం చేసుకుంటాడు. తర్వాత పిటిషనర్లకు గాంధీనగర్​లో ఉన్న తన కార్యాలయానికి పిలిపించుకుంటాడు. తన ఆఫీసును కోర్టులాగా తీర్చిదిద్దాడు. అక్కడ ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా నటిస్తూ తన క్లైయింట్​లను అనుకూలమైన తీర్పును ఇచ్చి, ఉత్తర్వును జారీ చేస్తాడు. శామ్యూల్ అనుచరులే న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులుగా నటిస్తారు." అని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.