Egg Omelette Making Video Viral : సోషల్ మీడియా పుణ్యమా అని వెరైటీ వీడియోలన్నీ నిమిషాల్లోనే తెగ వైరల్ అవుతున్నాయి. క్షణాల్లోనే లైక్‌లు, కామెంట్లతో హోరెత్తిపోతున్నాయి. ఓ వైపు కొందరు వాంటెడ్‌గా తమ టాలెంట్ చూపిస్తుండగా.. మరికొందరు తమకు తెలియకుండానే వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా.. ఓవర్ నైట్‌లో ఫేమస్ అయిన వారు.. సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఎందరో. తాజాగా , ఓ మహిళ ఆమ్లెట్ వేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. "అదిరిందయ్యా ఆమ్లెట్"’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మనలో చాలా మంది ఎగ్‌తో చేసిన ఎలాంటి రెసిపీ అయినా ఎంతో ఇష్టంగా తింటారు. అందులో ఇక ఆమ్లెట్.. అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో కొంత మంది బ్రేక్‌ఫాస్ట్‌గా ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి చేసుకుని తింటున్నారు. నిజానికి నాన్‌వెజ్ వంటకాలలో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోగలిగేది ఆమ్లెట్(Omelette) ఒక్కటే. అయితే, కొంతమంది దీనిని కూడా పెద్ద కష్టంగానే భావిస్తారు. ఇంకొందరు ఆమ్లెట్ వేసుకుంటుంటే మధ్యలో విరిగిపోతుందని, ఆమ్లెట్‌ను రెండో వైపు తిప్పడం రావడం లేదని బాధపడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఓ మహిళ వినూత్నంగా ఆలోచించి అదిరిపోయే ట్రిక్ కనుగొంది. ఈ ట్రిక్‌తో ఆ మహిళ ఆమ్లెట్ వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు వారెవ్వా.. ఏం టెక్నిక్ రా బాబూ.. అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలోని టెక్నిక్ ఏంటంటే..
కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ ఆమ్లెట్ వేయడానికి ముందుగా పెనంపై రెండు పొడవాటి దారాలను ఒకదానిపై మరొకటి క్రాస్‌గా పెట్టింది. ఆ తర్వాత ముందే ప్రిపేర్ చేసిన ఆమ్లెట్ మిశ్రమాన్ని పాన్ మీద పోసింది. ఆమ్లెట్ కింద భాగం బాగా కాలిన తర్వాత రెండు వైపు తిప్పేందుకు.. గరిటె యూజ్ చేయకుండా దారాల నాలుగు కొసలను పట్టుకుని పైకి ఎత్తి ఈజీగా తిప్పేసింది. తర్వాత ఆమ్లెట్ రెండు వైపులా కాలిన తర్వాత ఆ దారాలను తీసివేసింది. ఆమ్లెట్ రెడీ.. మీరు కూడా ఇలా ట్రై చేయండి.. అంటూ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 53 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 7లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో 'వావ్..! ఆమ్లెట్ ఇలాక్కూడా వేయొచ్చని ఇప్పుడే తెలిసిందంటూ'.., ఇంకొందరేమో 'ఈ ఐడియా ఏదో బాగుందంటూ'.., "అక్కా.. ఇన్ని రోజులు ఎక్కడున్నావ్" అని మరికొందరు, అలాగే కొందరేమో వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.