ETV Bharat / bharat

కంగన, మమతపై వ్యాఖ్యలు- ఎన్నికల వేళ సుప్రియ, దిలీప్‌కు ఈసీ షాక్​! - EC On Bad Remarks

EC On Bad Remarks : సార్వత్రిక ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌, బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.

EC On Bad Remarks
EC On Bad Remarks
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 5:57 PM IST

EC On Bad Remarks : ప్రత్యర్థి పార్టీల నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌, బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకుంటే తప్పుగా పరిగణించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు భావిస్తామని తేల్చిచెప్పింది. ఇద్దరి వ్యాఖ్యలు మర్యాదరాహిత్యమైనవని, చెడు అభిరుచితో కూడుకుని ఉన్నాయని తెలిపింది.

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బర్దమాన్-దుర్గాపుర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్‌ హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన, బంగాల్‌లో ఉన్నప్పుడు మమతా ఆ రాష్ట్ర కూతురిని అని చెప్పుకుంటారని వ్యాఖ్యానించారు. గోవాకు వెళ్తే ఆ రాష్ట్ర కుమార్తెనని, త్రిపురలో త్రిపుర కుమార్తెనని చెప్పుకుంటారని అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

టీఎంసీ ఆవేదన- బీజేపీ ఖండన
దిలీప్ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు మహిళలపై ద్వేషం, అగౌరవభావం పెంచేలా ఉన్నాయని టీఎంసీ ఆవేదన వ్యక్తం చేసింది. ఘోష్‌ వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది. ఇలాంటి అసభ్యకర విధానాలకు బీజేపీ విరుద్ధమని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రవర్తనకు కారణాలను పార్టీకి వివరించాలని ఘోష్‌కు సూచించింది. ఈ క్రమంలో ఘోష్ పార్టీకి క్షమాపణలు చెప్పారు. పార్టీకి లేఖ ద్వారా అధికారిక సమాధానం ఇస్తానని తెలిపారు.

శ్రేనేత్‌పై మహిళా కమిషన్ ఫైర్​
మరోవైపు, హరియాణాలోని మండి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా ఉన్న సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌ ఇలాంటి వైఖరే ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంగనాను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో శ్రీనేత్‌ పోస్టు పెట్టారని బీజేపీ తెలిపింది. అయితే సుప్రియ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఇతరులు ఆ పోస్టు చేశారని వివరణ ఇచ్చారు. జాతీయ మహిళా కమిషన్ కూడా శ్రేనేత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

'మహిళకు టికెట్‌ ఇస్తే వ్యక్తిత్వంపై దాడి చేస్తారు'
సుప్రియా శ్రీనేత్, గుజరాత్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కో-ఆర్డినేటర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని జాతీయ మహిళా కమిషన్ కోరింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏ మాత్రం సహించరానిదని మండిపడింది. సుప్రియ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్‌, ఒక మహిళకు టికెట్‌ ఇస్తే వ్యక్తిత్వంపై దాడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించానని, ఏ వృత్తిలో ఉన్నా ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.