ETV Bharat / bharat

వానాకాలంలో దుస్తులు సరిగా ఆరక వాసన వస్తున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే ఫ్రెష్​ అండ్​ సువాసన పక్కా! - Tips To Remove Smells From Clothes - TIPS TO REMOVE SMELLS FROM CLOTHES

Tips To Remove Bad Odors From Clothes : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బట్టలు ఆరబెట్టడం పెద్ద టాస్క్​. వానాకాలంలో అధిక తేమ కారణంగా ఎంత నీరు లేకుండా పిండి ఆరేసినా బట్టలు త్వరగా ఆరిపోవు. అంతే కాకుండా బట్టల నుంచి ఓ రకమైన వాసన వస్తుంటుంది. అలాంటి టైమ్​లో ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్యే ఉండదంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips To Get Rid Of Musty Smells From Clothes
Tips To Remove Bad Odors From Clothes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 12:06 PM IST

Tips To Get Rid Of Musty Smells From Clothes : బట్టలు ఉతకడం ఒక పని అయితే.. వాటిని ఆరబెట్టడం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా పెద్ద టాస్క్​. వానాకాలం వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల ఉతికిన బట్టలు సరిగ్గా ఆరవు. ముట్టుకుంటే ఆరినట్లుగా అనిపిస్తాయి.. కానీ, వాటిలో తేమ అలాగే ఉండిపోతుంది. వాటిని అలాగే మడతపెట్టి వార్డ్​రోబ్​లో పెట్టామంటే వాటిలో ఫంగస్ వృద్ధి చెంది అదో రకమైన వాసన వస్తుంది. అంతేకాదు.. ఈ వాసన తాజాగా ఉన్న బట్టలకూ(Clothes) పట్టడం, ఇళ్లంతా నిండిపోవడంతో విసుగొచ్చేస్తుంటుంది. కాబట్టి వానాకాలంలోనూ దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా, బట్టలు తాజాగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వెనిగర్‌ : వర్షాకాలంలో దుస్తుల నుంచి వచ్చే చెడు వాసనలను తొలగించడంలో వైట్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో ఉండే ఆమ్ల స్వభావం దుర్వాసనకు కారణమయ్యే ఫంగస్​ను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. వాషింగ్ మెషిన్​లో బట్టలు వాష్ చేయడానికి ముందుగా డిటర్జెంట్​లో.. ఒక కప్పు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్​గా చేతితో బట్టలు ఉతుకుతున్నట్లయితే.. దుస్తులు ఉతికే నీటిలో మీ డిటర్జెంట్​తో పాటు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి.

2018లో టెక్స్టైల్ రీసెర్చ్ జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వెనిగర్ దుస్తుల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్ ను చంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని లీడ్స్ విశ్యవిద్యాలయంలో పనిచేసే టెక్స్టైల్ సైన్స్ ఎండ్ సాంకేతికత రంగంలో నిపుణుడు డాక్టర్ ఐరెన్ డోనాల్డ్సన్ పాల్గొన్నారు. వెనిగర్ వర్షాకాలంలో బట్టల నుంచి వచ్చే చెడు వాసనలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

నిమ్మరసం : ముఖ్యంగా తడి బట్టలు తేమ కారణంగా దుర్వాసన వస్తున్నట్లయితే బకెట్ నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపి అందులో బట్టలను కాసేపు నానబెట్టుకోవాలి. ఆపై వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మకాయలోని సహజ యాసిడ్ దుర్వాసనను తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేస్తుందంటున్నారు.

దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్​- వాషింగ్​ మెషీన్​లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!​

ఎసెన్షియల్ ఆయిల్స్‌ : లావెండర్, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వర్షాకాలంలో బట్టల నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలో మంచి సువాసను అందించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. నచ్చిన ఆయిల్ ఎంచుకొని బట్టలు వాష్ చేసే ముందు వాషింగ్ మెషిన్​లో కొన్ని చక్కలు పోసుకోవాలి. లేదంటే.. ఒక స్ప్రే బాటిల్​లో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్​ను కొన్ని చుక్కలు తీసుకొని దానికి వాటర్ కలుపుకొని బట్టలు ఆరబెట్టే ముందు వాటిపై లైట్​గా స్ప్రే చేసుకున్నా సరిపోతుందంటున్నారు నిపుణులు.

పూర్తిగా ఆరబెట్టుకోవాలి : వర్షాకాలంలో దుస్తుల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే వాటిని సరిగ్గా ఆరబెట్టుకోవడం కూడా చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బట్టలు తడిగా ఉన్నప్పుడు సరిగ్గా గాలి వీచని గదుల్లో ఆరేస్తే తేమ కారణంగా ఫంగస్ చేరి చెడు వాసన వస్తుంటాయి. కాబట్టి ఉతికిన బట్టలను ఇంట్లో వేసుకున్నా.. ఆ గదిలో గాలి బాగా ఆడేలా కిటికీలు, వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకుంటే దుస్తులు దుర్వాసన వెదజల్లవంటున్నారు.

అలాగే వర్షాకాలంలో ఇంట్లో దుస్తులతో పాటు బెడ్​షీట్లను క్రమం తప్పకుండా వాష్ చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే.. తడి వాతావరణంలో వీటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పేరుకుపోతుందని చెబుతున్నారు. అలాగే ఈ సీజన్​లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

వాషింగ్​ మెషీన్​లో బట్టలు మాత్రమే కాదు - ఇవి కూడా క్లీన్​ చేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.