ETV Bharat / bharat

ఇంట్లో ఫ్లోటింగ్​ షెల్ఫులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తూ క్లీన్​ చేస్తే అందంగా ఉంటాయి! - Easy Ways to Clean Floating Shelves

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 3:28 PM IST

Floating Shelves Cleaning: ప్రస్తుతం చాలా మంది తమ ఇంటిని అందంగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇంటీరియర్‌లో భాగంగా వేలాడే అరలకి ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. ఇవి.. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకురావడమే కాదు.. స్థలాన్ని ఆదా చేస్తాయి. అయితే వీటిని శుభ్రం చేసే విషయంలో ఈ టిప్స్​ పాటిస్తే.. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని అంటున్నారు.

Floating Shelves Cleaning
Easy Ways to Clean Floating Shelves (ETV Bharat)

Easy Ways to Clean Floating Shelves: నేటి కాలంలో చాలా మంది తమ ఇంటిని మోడ్రన్​గా డిజైన్​ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్​ దగ్గర నుంచి అవుట్​డోర్​ వరకూ అన్ని విషయాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇంటీరియర్‌లో భాగంగా ఇప్పుడు చాలా మంది ఫ్లోటింగ్​ షెల్ఫ్స్​ (Floating Shelves)కి ప్రాధాన్యమిస్తున్నారు. ఇవి ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు స్థలాన్ని ఆదా చేస్తాయి. అయితే వీటిని అమర్చుకుంటే సరిపోదని.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం దుమ్ము-ధూళి చేరి వాటికున్న అందం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అలాగని సాధారణ షెల్ఫుల్లాగా శుభ్రం చేస్తే అవి డ్యామేజ్‌ అయ్యే అవకాశాలూ ఎక్కువే అంటున్నారు. కాబట్టి వాటిని క్లీన్​ చేసే విషయంలో హ్యాండిల్​ విత్​ కేర్​ అంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి..

గ్లాస్​ ఫ్లోటింగ్​ షెల్ప్స్​: గాజు అరలు ఇంటికి ఎంత అందాన్నిస్తాయో.. వాటి నిర్వహణ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అంత త్వరగా డ్యామేజ్‌ అవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వాటిపై గీతలు పడే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. వాటిని శుభ్రం చేయడానికి పలు టిప్స్​ పాటించాలని అంటున్నారు. అందుకోసం మృదువైన కాటన్‌/టర్కీ క్లాత్‌ తీసుకోవాలి. దాన్ని వెనిగర్‌ - నీళ్లు సమానంగా తీసుకొని కలిపిన మిశ్రమంలో ముంచి, గట్టిగా పిండి.. షెల్ఫుల పైన, కింద, మూలల్లో క్లీన్‌ చేయాలి. లేదంటే ఈ లిక్విడ్​ను నేరుగా షెల్ఫులపై స్ప్రే చేసి కూడా క్లీన్​ చేయవచ్చు. ఆపై పొడి గుడ్డతో మరోసారి తుడవాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే దుమ్ము-ధూళి తొలగిపోవడంతో పాటు, వాటిపై పడిన జిడ్డు మరకలు కూడా వదిలిపోయి కొత్త వాటిలా మెరుస్తాయని చెబుతున్నారు.

స్టీల్​ గేట్లు, రెయిలింగ్​పై మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే తుప్పు వదిలిపోయి కొత్తగా మెరుస్తాయి!

చెక్క షెల్ఫులు: చాలా ఇళ్లలో చెక్కతో చేసిన ఫ్లోటింగ్‌ షెల్ఫులను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే అవి ఓపెన్‌ షెల్ఫులు కావడం వల్ల త్వరగా దుమ్ము చేరే అవకాశాలుంటాయని.. కాబట్టి వాటిని ఎప్పటిప్పుడు శుభ్రం చేయాలంటున్నారు. ఇందుకోసం బేకింగ్‌ సోడా, నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమంలో ఒక కాటన్‌ క్లాత్‌ను ముంచి బాగా పిండాలి. దీంతో షెల్ఫుల్ని మూలమూలలా శుభ్రం చేస్తే సరిపోతుంది. ఆపై మరోసారి పొడి కాటన్‌ క్లాత్‌తో తుడవాలి. తద్వారా అవి నీటిని పీల్చుకోకుండా త్వరగా ఆరిపోతాయని సూచిస్తున్నారు.

తుప్పు వదిలేలా: లోహాలతో తయారైన షెల్ఫులు, వైర్‌తో అల్లినట్లుగా ఉండే ఫ్లోటింగ్‌ షెల్ఫులు కూడా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి షెల్ఫులు తేమకు త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని శుభ్రం చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో ఆల్‌ పర్పస్‌ క్లీనర్స్‌ ఉన్నాయి. వాటిని నేరుగా అరలపై స్ప్రే చేసి టూత్‌ బ్రష్‌ సహాయంతో రుద్ది శుభ్రం చేయవచ్చు. ఆపై పొడి క్లాత్‌తో తుడిచేయాలి. ఒకవేళ ఈ అరలు ఎక్కడైనా తుప్పు పట్టినట్లు అనిపిస్తే.. ఆ భాగంలో కొద్దిగా ఉప్పు వేసి రుద్ది.. ఆ తర్వాత నిమ్మరసం-వైట్‌ వెనిగర్‌ సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ఆ భాగంపై నుంచి పోసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసి పొడి గుడ్డతో మరోసారి తుడవాలని అంటున్నారు.

ప్లాస్టిక్‌: కొంతమంది ఇళ్లలో ప్లాస్టిక్‌ ఫ్లోటింగ్‌ షెల్ఫుల్ని కూడా చూస్తుంటాం. ఈ తరహా అరల్ని శుభ్రం చేయడానికి బేకింగ్‌ సోడా, నీళ్లు కలిపి మిక్స్​ చేసి దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపి అరలపై స్ప్రే చేయాలి. ఇప్పుడు తడి గుడ్డతో తుడిచి ఆపై పొడి క్లాత్‌తో మరోసారి తుడిచేస్తే అవి క్లీనవుతాయి. అయితే వాటిపై ఏవైనా జిడ్డు మరకల్లాంటివి ఉంటే క్లీనింగ్‌ బ్రష్‌ని ఉపయోగించి వాటిని తొలగించవచ్చని అంటున్నారు.

2017లో Journal of Applied Microbiologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బేకింగ్ సోడా ప్లాస్టిక్ షెల్ఫుల నుంచి మరకలు, దుమ్మును తొలగించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్థాన్​లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌ డాక్టర్ A. Ahmad పాల్గొన్నారు.

NOTE : పైన పేర్కొన్న అంశాలు పలువురు నిపుణులు, పరిశోధనల ప్రకారం అందించినవే. వీటిని పాటించడం, పాటించకపోవడం మీ వ్యక్తిగత విషయం.

ప్లాస్టిక్​ బాక్సులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేస్తే బ్యాడ్​ స్మెల్​ పరార్​!

స్టెయిన్​లెస్‌ స్టీల్‌ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.